Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
Naralokesh padayatra,Yuvagalam
Naralokesh padayatra,Yuvagalam

2500 కి.మీ.ల మజిలీకి చేరుకున్న యువగళం! మంగళగిరి నియోజకవర్గంలో 20వేల ఇళ్ల నిర్మాణానికి హామీ

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగిసిన యువగళం పాదయాత్ర

ప్రకాశం బ్యారేజిపై పోటెత్తిన జనం…విజయవాడలో ప్రభంజనం

రాష్ట్రంలో అరాచకపాలనపై సమరభేరి మోగిస్తూ 5కోట్ల ప్రజల జనగళమే యువగళమై సాగుతున్న  చారిత్రాత్మక Nara Lokesh యువగళం పాదయాత్ర 188వరోజు మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో 2500 కి.మీ.ల మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా యువనేత లోకేష్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఇళ్లులేని 20వేల మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు. దీంతోపాటు అసైన్డ్, కొండ, వాగు, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్దీకరించి పట్టాలు అందజేస్తానని మాటఇచ్చారు. ఉండవల్లిలోని చంద్రబాబుగారి నివాసం వద్దనుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో స్పదన లభించింది. కొండవీటి వాగు వద్ద లోకేష్ కు బోట్ అసోసియేషన్ ప్రతినిధులు యువగళం జెండాలతో కృష్ణానదిలో బోట్లపై స్వాగతం పలికారు. వైసిపి ప్రభుత్వం లో తాము నష్టపోయిన తీరును వివరిస్తూ వినూత్న గజమాలను ఏర్పాటుచేశారు.  తమకు పూర్వవైభవం తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా నదిలో పడవలను ప్రదర్శించారు. యువగళం పాదయాత్ర గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం బ్యారేజిపై గుండా ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించే సమయంలో భారీగా ప్రజలు హాజరయ్యారు. విజయవాడ ప్రజలు యువనేతకు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు యువనేతకు వీడ్కోలు పలకగా, విజయవాడ నాయకులు ఘనస్వాగతం పలికారు.  పసుపుజెండాలు, యువగళం బెలూన్లతో యువనేతన స్వాగతించారు. భారీగా తరలివచ్చిన ప్రజలతో ప్రకాశం బ్యారేజి పరిసరాలు జనసంద్రంగా మారాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొడుతూ యువనేతను స్వాగతించారు. బాణాసంచా మోతలు, నినాదాలతో హోరెత్తుతున్న ప్రకాశం బ్యారేజి పరిసరాలు హోరెత్తాయి. అనంతరం పశ్చిమ నియోజకవర్గంలోని వన్ టౌన్ లోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది. పార్టీ నేతలు కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్దావెంకన్న, టిడిపి వాణిజ్యవిభాగం నేత డూండీ రాకేష్ నేతృత్వంలో యువనేతకు ఘనస్వాగతం లభించింది. భారీ గజమాలలు, పూలవర్షంతో యువనేతను ముంచెత్తారు. విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ, గద్దే రామ్మోహన్ రావు, గద్దే అనూరాధ తదితరులు యువనేతను స్వాగతించారు. 188వరోజు యువనేత లోకేష్ 13.3 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2509.8 కి.మీ.ల మేర పూర్తయింది.

యువనేత లోకేష్ సెల్ఫీ చాలెంజ్ లు

ప్రజావేదిక శిథిలాలే సైకోపాలనకు సమాధిరాళ్లు

ప్రత్యక్షసాక్షి  ఉండవల్లిలోని ప్రజావేదిక. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో 2019 జూన్ 25న  మొదలైన కూల్చివేతల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 51నెలల రాక్షస పాలనలో గూడు కోల్పోయిన లక్షలాది పేదల కన్నీరు దావానలంగా మారుతోంది. ఏ విధ్వంసంతో నువ్వు పాలన ప్రారంభించావో అక్కడి నుంచే నీ పతనం ప్రారంభం కాబోతోంది… ఈ ప్రజావేదిక శిథిలాలే మరో 9 నెలల్లో నీ అరాచక ప్రభుత్వానికి సమాధిరాళ్లు కాబోతున్నాయి.

 దార్శనికుడి ముందుచూపు …కొండవీటివాగు ఎత్తిపోతల

దార్శనిడుకు చంద్రబాబునాయుడు ముందుచూపునకు నిదర్శనం కొండవీటివాగు ఎత్తిపోతల పథకం. రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.222 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. రికార్డు సమయంలో కేవలం 18నెలల్లో పూర్తిచేసి 2018 సెప్టెంబర్ 16న రాష్ట్రప్రజలకు అంకితం చేశారు. ఒకేరోజు ఒక టీఎంసీ నీళ్లు వచ్చినా సమర్థవంతంగా వరదను నివారించే విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దివాలాకోరు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పెట్టలేక రైతాంగాన్ని వరదల్లో ముంచెత్తుతున్నాడు.

నారా లోకేష్ ను కలిసిన విజయవాడ ఆర్యవైశ్యులు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ వినాయక గుడి వద్ద ఆర్యవైశ్య సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. TDP పాలనలో ఆర్యవైశ్యులకు దక్కిన గౌరవం, అందిన అవకాశాలు మరువలేనివి. ఎన్నికల్లో సీట్లు, నామినేటెడ్ పదవులు, వివిధ స్థానాల్లో పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ పెట్టి నిధులు కేటాయించిన ఘనత చంద్రబాబుది.  వైసీపీ అధికారంలోకి వచ్చాక మా కార్పొరేషన్ కు నిధులు కేటాయించలేదు. మీరు అధికారంలోకి వచ్చాక జనాభా దామాషా ప్రకారం మాకు నిధులు కేటాయించాలి. నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం అవకాశాలివ్వాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును ఆర్యవైశ్యులకు కేటాయించాలి. మంత్రివర్గంలో, పార్టీ పదవుల్లో తగిన ప్రాధాన్యతనివ్వాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జె-ట్యాక్స్ విధానాల కారణంగా ఆర్యవైశ్యుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రకరకాల పన్నులతోపాటు జె-ట్యాక్స్ కోసం వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నించిన వ్యాపార ప్రముఖులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు బనాయించి జైలులో పెట్టారు. నంద్యాల మండీ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువీధి వెంకటసుబ్బయ్య కిరాతకంగా చంపిన రౌడీలు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులు స్వేచ్చగా వ్యాపారాలు  చేసుకునే అవకాశం కల్పిస్తాం. అనవసరమైన పన్నుల భారాన్ని తగ్గించి వ్యాపారాలను ప్రోత్సహిస్తాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, చిరువ్యాపారులకు సబ్సిడీరుణాలు అందజేస్తాం. ఆర్యవైశ్యులకు  రాజకీయంగా అవకాశాలు కల్పిస్తాం.

లోకేష్ ను కలిసిన ముఠా వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

విజయవాడ కాళేశ్వరరరావు మార్కెట్ క్లాత్ ముఠావర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మేం 40ఏళ్లుగా విజయవాడ వస్త్రలత సముదాయంలో ముఠా కార్మికులుగా ఉన్నాం. టీడీపీ పాలన వరకు మేం ఎలాంటి ఇబ్బందులు చవిచూడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో మా పరిస్థితులు దుర్భరంగా మారాయి. కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టతరంగా మారింది. నిత్యావసరాలు, కరెంటు బిల్లులు, ఇతర చార్జీలు, గ్యాస్ ధరలు, పన్నులు పెంచేశారు. మాలాంటి హమాలీలు బతుకుబండి లాగడం ఇబ్బందిగా మారింది. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

నాలుగేళ్ల  పాలనలో పేదవాళ్ల బ్రతుకులు ఛిద్రమయ్యాయి. పేదవాడినని చెప్పుకునే ముఖ్యమంత్రి అన్నాక్యాంటీన్లు రద్దుచేసి పేదోళ్ల నోటికాడ కూడు తీసేశాడు. ఇంటిపన్నులు, కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదవాడి బతుకును ఛిద్రంచేశారు. టిడిపి అధికారంలోకి రాగానే ప్రజలపై మోపిన అన్నిరకాల భారాలను సమీక్షించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తాం. అన్నాక్యాంటీన్లను పునరిద్దించి పేదవాళ్ల ఆకలి తీరుస్తాం. ముఠా కార్మికులకు చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేస్తాం.

లోకేష్ ను కలిసిన విజయవాడ ఎలక్ట్రికల్ వర్కర్స్ ప్రతినిధులు

విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద ఎలక్ట్రికల్ వర్కర్లు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా7,895మంది  గ్రేడ్-2 జూనియర్ లైన్ మెన్లుగా  2019 అక్టోబర్ లో విధుల్లో చేరాం. 2సంవత్సరాలు ప్రొవిజన్ కాలం ముగిసినా మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు. తాజాగా ధర్నా చేయడంతో మా రెగ్యులేషన్ ఆర్డర్ ఇచ్చి, అందులో కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ ఉంటాయని పేర్కొన్నారు. దీనివల్ల మాకు తీవ్రంగా నష్టం కలుగుతుంది. ఒకవైపు డిపార్ట్ మెంట్ పనులు, మరోవైపు సచివాలయం పనులు చేస్తూ అలసిపోతున్నాం. మాకు సచివాలయం పేస్కేల్ అడాప్ట్ చేశారు. కానీ డిపార్ట్ మెంట్ హైరిస్క్ పనులన్నీ మాతోనే చేయిస్తున్నారు. 2019 నుండి నేటికి 129మంది చనిపోయారు. 250మంది గాయపడ్డారు. మేము సచివాలయం ఉద్యోగులమా? డిపార్ట్ మెంట్ ఉద్యోగులమా నిర్ణయించాలి. సచివాలయ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5వరకే పని చేయించాలి. డిపార్ట్ మెంట్ ఉద్యోగులమైతే లైన్ మెన్లకు ఇచ్చే పే స్కేలు, అలవెన్స్ ను మాకు అడాప్ట్ చేయాలి. మాకు రాష్ట్ర ఖజానా నుండి జీతాన్ని ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

మాటతప్పడం, మడమతిప్పడం వెన్నతోపెట్టిన విద్య. తమ న్యాయమైన డిమాండ్లకోసం పోరాడే ఉద్యోగులపై  ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేనివిధంగా అణచివేత చర్యలకు పాల్పడుతోంది. జూనియర్ లైన్ మెన్ల సమస్యలకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. వారు పరిష్కరించకపోతే టిడిపి ప్రభుత్వం వచ్చాక సమస్యలను పరిష్కరిస్తాం. పేస్కేల్స్ విషయంలో ఎలక్ట్రికల్ ఉద్యోగులకు న్యాయం చేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఆటోవర్కర్స్ ప్రతినిధులు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్వర్ణప్యాలెస్ వద్ద ఆటోవర్కర్స్ యూనియన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆటో ఇన్సూరెన్స్, బ్యాంక్ చలానాల భారాన్ని తగ్గించాలి. కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి. అర్హులైన పేద కార్మికులందరికీ ఇళ్లు ఇప్పించాలి. ఆటోలకు స్టాండ్లు ఏర్పాటుచేసి, పార్కింగ్ సదుపాయం కల్పించాలి. కార్మికులకు ప్రమాదబీమా సాయం పెంచాలి. భవన నిర్మాణ కార్మికుల మాదిరిగా పనిముట్లు ఉచితంగా అందించాలి. ఆటో కావాల్సిన వారికి బ్యాంకు లోన్లు సబ్సిడీపై అందించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

ప్రభుత్వం చీటికీమాటికి ఆటోకార్మికులపై ఫైన్లువేస్తూ కార్మికుల రక్తమాంసాలు పీల్చేస్తోంది.  అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం. ఆటో కార్మికుల కోసం త్రాగునీరు, టాయిలెట్ లాంటి మౌలిక వసతులతో ఆటో స్టాండ్స్ ఏర్పాటు చేస్తాం. ప్రమాద బీమా, హెల్త్ ఇన్స్యూరెన్స్, ఆటో ఇన్స్యూరెన్స్ అన్ని బోర్డు ద్వారా తక్కువ ధరకు అందిస్తాం.  ఆటో కార్మికులకు పోలీసుల వేధింపులు లేకుండా చేస్తాం. సబ్సిడీ తో ఎలక్ట్రిక్ ఆటో లు అందజేస్తాం. ఆటో స్టాండ్స్ లోనే ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తాం. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను చంద్రన్న బీమా ద్వారా ఆదుకుంటాం.

లోకేష్ ను కలిసిన బుక్ పబ్లిషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బీసెంట్ రోడ్డులో విజయవాడ బుక్ పబ్లిషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మేం 13ఏళ్లుగా విజయ టాకీస్ సెంటర్ వద్ద బుక్ షాపులు నిర్వహిస్తున్నాం.కరోనా సమయంలో మేం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రభుత్వం తాలూకు ప్రచురించిన పుస్తకాలకు బిల్లులు రావడం లేదు. 4ఏళ్లు పూర్తైనా బిల్లులు విడుదల చేయడం లేదు. పైగా మేం దొంగ పుస్తకాలు అమ్ముతున్నామని ఇబ్బందులు పెడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.

నారా లోకేష్ ను ముస్లిం సామాజికవర్గీయులు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విజయటాకీస్ వద్ద ముస్లిం సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పేద ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా పూచీకత్తు లేకుండా లక్షరూపాయలు రుణం ఇప్పించాలి. దుల్హాన్ పథఖం ద్వారా పేద ముస్లింలకు లక్షరూపాయల ఆర్థికసాయం అందించాలి. ఈ ప్రభుత్వం వచ్చాక ఆపేసిన దుకాన్ – మకాన్, విదేశీవిద్య పథకాలను పునరుద్దరించాలి. వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని, తిరిగి అప్పగించాలి. రంజాన్ మాసంలో మసీదుల మరమ్మతులకు నిధులు ఇవ్వాలి. ఇమామ్, మౌజన్ లకు ఇచ్చే వేతనాలను పెంచాలి. ఖబరస్తాన్ ప్రహరీలకు నిధులు ఏర్పాటు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో షాదీఖానాలు ఏర్పాటు చేయాలి. రంజాన్ తోఫా పథకాన్ని పునరుద్ధరించాలి. అరండల్ పేటలో లైబ్రరీకి అనుబంధంగా ఉన్న షాదీఖానా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. షాదీఖానాకు స్థలం సరిపోవడం లేదు..మరో 200గజాల స్థలం ఇప్పించాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

నర్సరావుపేట మసీదు ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను నడిరోడ్డుపై నరికిచంపారు. మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు రూ.5,400కోట్లను దారిమళ్లించి తీరని ద్రోహం చేశాడు. అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన మైనారిటీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. దుల్హాన్ పథకాన్ని ఎటువంటి కొర్రీలు లేకుండా పేద ముస్లింలందరికీ వర్తింపజేస్తాం. షాదీఖానాలు, మసీదుల అభివృద్ధి, ఖబరిస్థాన్ ల ప్రహరీగోడల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కొత్తవంతెన సెంటర్ లో బ్రాహ్మణ సామాజికవర్గ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 40వేల మంది బ్రాహ్మణ కుటుంబాలున్నాయి. టీడీపీ పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మాకు పథకాలు అమలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులిచ్చి బలోపేతం చేయాలి. మా నియోజకవర్గంలో బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కర్మకాండల భవనం నిర్మించాలి. దేవాలయాల్లో అర్చకులకు గౌరవ జీతభత్యాలు చెల్లించాలి. దేవాలయ ఆస్తులను పరిరక్షించాలి. బ్రాహ్మణ కుటుంబాల్లో ఒంటరిమహిళలను ఆదుకోవాలి. బ్రాహ్మణులకు రాజకీయంగా తగు ప్రాధాన్యత కల్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

బ్రాహ్మణులపై కూడా వైసిపి ముష్కరమూకలు పేట్రేగిపోతున్నాయి. ఇటీవల భీమవరంలో వైసిపినాయకుడు యుగంధర్ పురోహితుడిపై దాడిచేసి యజ్ఞోపవీతాన్ని తెంచేశాడు. గత టిడిపి ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా 5ఏళ్లలో బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.285 కోట్లు ఖర్చు చేసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అపర కర్మలు నిర్వహించుకోవడం కోసం ప్రత్యేక  భవనాలు నిర్మిస్తాం. గతంలో స్వయం ఉపాధికి నాలుగు లక్షల వరకూ 50 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ని మరింత బలోపేతం చేస్తాం. బ్రాహ్మణులని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తాం. బ్రాహ్మణ ఆడ బిడ్డల పెళ్లి కి ప్రభుత్వం నుండి సహాయంతో పాటు కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. అర్చకులకు గుర్తింపు కార్డులు, గౌరవ వేతనం, గౌరవం ఇస్తాం. బ్రాహ్మణులకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తాం.

లోకేష్ ను కలిసిన ఆర్ఎంపి అసోసియేషన్ ప్రతినిధులు

విజయవాడ సీతారాంపురం సిగ్నల్ జంక్షన్ లో ఆర్ ఎంపి వైద్యుల సంక్షేమ సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా గ్రామీణ పేదలకు ప్రాథమిక వైద్యం అందిస్తున్నాం. నేటికీ మాకు ప్రభుత్వం నుండి గుర్తింపు దక్కలేదు. ప్రభుత్వాలను అడుగుతున్నా మా విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదు. టీడీపీ పాలనలో కమ్యూనిటీ పారామెడిక్స్ గా ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేశారు. దీనికోసం జీఓఆర్టీ నంబర్ 465ను 2017 ఆగష్టు 22న విడుదల చేశారు కానీ న్యాయం జరగలేదు. రాష్ట్రంలో ఉన్న సుమారు 50వేల మంది ఆర్.ఎం.పి మరియు పీఎంపీలకు గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ అధికారంలోకి వచ్చాక వైద్యరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక పేషెంట్లే కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. భారీగా బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయడంలేదు. కరోనా సమయంలో ఆర్ఎంపి, పిఎంపిలు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో సేవచేశారు.  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కమ్యూనిటీ పారామెడిక్స్ ను అధికారికంగా గుర్తించి వారి సేవలను గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలకు వినియోగించుకుంటాం.

లోకేష్ ను కలిసిన ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ ప్రతినిధులు

విజయవాడ చుట్టుగుంట సెంటర్ లో ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల మంది ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్లు ఉన్నారు. ఎలక్ట్రీషియన్లకు సంవత్సరంలో 6నెలలు మాత్రమే పనులు దొరుకుతున్నాయి. ప్రైవేటు ఎలక్ట్రికల్ కార్మికులకు చేయూతనిచ్చి పని భద్రత కల్పించాలి. మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మండలానికొక సర్వీసు సెంటరు పెట్టి స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వాలి. ప్రైవేటు ఎలక్ట్రికల్ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా పనిముట్లకు రూ.2లక్షల సబ్సిడీ లోన్లు ఇప్పించాలి. 60ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కల్పించాలి. పేద కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా నెలకు రూ.5వేలు పెన్షన్ సదుపాయం కల్పించాలి. విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.10లక్షలు నష్టపరిహారం కల్పించాలి. మాకు ఈఎస్ఐ వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రీషియన్ డే ను జనవరి 27న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది. పునరుద్ధరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

ఇసుక దోపిడీ పాలసీ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 40లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు. నాలుగేళ్ల విధ్వంసక పాలనలో భవన నిర్మాణరంగానికి అనుబంధంగా ఉన్న ఎలక్ట్రికల్ వర్కర్లు తీవ్రంగా నష్టపోయారు. కార్మికులకోస ఖర్చుచేయాల్సిన సంక్షేమ బోర్డు నిధులు సుమారు 1200 కోట్లు దారిమళ్లించి తీరని ద్రోహం చేశారు. కరోనా సమయంలో కార్మిక సంక్షేమ బోర్డు నుండి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును బలోపేతం చేస్తాం. సంక్షేమ బోర్డు ద్వారా గతంలో అందించిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం. కార్మికులకు సంక్ష మబోర్డు ద్వారా గుర్తింపుకార్డులిచ్చి ఈఎస్ఐ, చంద్రన్న బీమా వంటి పథకాలు వర్తింపజేస్తాం.

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *