Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
Naralokesh padayatra,Yuvagalam
Naralokesh padayatra,Yuvagalam

*2600 కి.మీ.లకు చేరిన యువగళం పాదయాత్ర్ర*

*చింతలపూడి ఎత్తిపోతల పథకానికి యువనేత శిలాఫలకం*

*నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న యువగళం*

నూజివీడు: జనగళమే యువగళమై రాష్ట్రంలో   అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ఈరోజు నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం సింహాద్రిపురం వద్ద 2600 కి.మీ.ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా చింతలపూడి ఎత్తిపోతల పథకానికి యువనేత నారా లోకేష్ శిలాపలకాన్ని ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిచేసి ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మెట్టప్రాంతాలకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. 195వరోజు యువగళం పాదయాత్ర నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో హోరెత్తింది. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు యువనేత లోకేష్ ను కలుసుకొని తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు.  ముసునూరు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తులు గత నాలుగేళ్లుగా తాము పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు, దళితులు, సగరలు యువనేతను కలుసుకుని సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. పోతిరెడ్డిపల్లి నుంచి ప్రారంభమైన యువనేత పాదయాత్ర కొర్లగుంట మీదుగా సింహాద్రిపురం, చెక్కపల్లి క్రాస్, చిలుకానగర్, క్రాస్ ముసునూరు మీదుగా వలసపల్లి క్యాంప్ సైట్ కి చేరుకుంది. 195వరోజు యువనేత లోకేష్ 17.2 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2613 కి.మీ.ల మేర పూర్తయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 8రోజులపాటు దుమ్మురేపిన యువగళం పాదయాత్ర ఆదివారం సాయంత్రం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

ధరల పెంపుతో పేద ప్రజల రక్తం తాగుతున్నాడు వారి నిర్వాకంవల్లే మల్లవల్లిలో పరిశ్రమలు తరలిపోయాయి!

ముసునూరు రచ్చబండ కార్యక్రమంలో యువనేత లోకేష్

నూజివీడు అభివృద్ది చేసి సంక్షేమం చెయ్యాలి కానీ జగన్ అప్పు చేసి సంక్షేమం చేస్తున్నాడు. ఇప్పుడు అప్పు ఇచ్చే వాడు లేక బటన్ నొక్కినా డబ్బులు పడటం లేదని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ముసునూరు గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ…  జగన్ ప్రజలపై భారం వేసి సంక్షేమం అంటున్నాడు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు, ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు పెంచాడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల రక్తం తాగుతున్నాడు. రాజధాని లేని రాష్ట్రం, పవర్ లేని రాష్ట్రం, క్రాప్ హాలిడే ఉన్న రాష్ట్రం, ఆక్వా హాలిడే ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే.

నూజివీడు భూకబ్జాలపై సిట్ వేస్తాం

ఇక్కడ ఎమ్మెల్యే కంటే ఆయన అబ్బాయి కేటు గాడు. భూకబ్జాలు, ఇసుక దోపిడి, గ్రావెల్ దోపిడి కి నూజివీడు ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నూజివీడులో జరిగిన భూకబ్జాలు ఇతర అరాచకాల పై సిట్ వేసి అవినీతి బయటపెడతాం. మా తల్లిని అవమానించారు, పార్టీ కార్యాలయం పై దాడి చేశారు, మా ఇంటి పై దాడి చేశారు. అప్పుడు పోలీసులకు రెచ్చగొట్టే చర్యలు లా కనపడలేదు. నేను జగన్ చేసే సైకో పనులు చూసి సైకో అనడం తప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమి చెయ్యలేదు.

వైసీపీ తినేది ఇసుక మాత్రమే

రోజుకి ఇసుక లో మూడు కోట్లు తింటున్నాడు. టిడిపి హయాంలో ట్రాక్టర్ రూ.1500 ఉంటే ఇప్పుడు వైసీపీ పాలన లో రూ.5000 వేలు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక, సిమెంట్, ఐరెన్ ధరలు తగ్గిస్తాం. జగన్ పాదయాత్ర చేసినప్పుడు టిడిపి రెచ్చగొట్టలేదు. ఆ దారిలో ఫ్లెక్సీలు కట్టి రెచ్చగోట్టే ప్రయత్నం చెయ్యలేదు, కార్యకర్తలు వెళ్లి అడ్డుకోలేదు. కేసులు పెట్టలేదు. అందుకే పాదయాత్ర అడ్డుకుంటున్నాడు. నా పై కేసులు పెడుతున్నాడు. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ కి టిడిపి హయాంలో 700 పరిశ్రమల ను తీసుకొస్తే సైకో పాలన చూసి ఇతర రాష్ట్రాలకు పారిపోయారు.

మహాశక్తి కార్యక్రమాన్ని అమలుచేస్తాం

ఇప్పుడు మీరే కట్టుకోండి అని చేతులు ఎత్తేసాడు. పేదలు ఎప్పటికీ పేదరికం లో ఉండాలి అనేది వైసీపీ కోరిక. 7 లక్షలు అప్పు చేస్తే కానీ పేదలు సెంటు స్థలం లో ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం. నూజివీడు లో టిడిపి జెండా ఎగరేయండి. అభివృద్ది బాధ్యత నాది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి పథకాన్ని అమలు చేస్తాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా రూ.1500. తల్లికి వందనం కింద పిల్లల చదువు కి రూ.15,000. ఇద్దరు పిల్లలు ఉంటే 30 వేలు. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టిసి బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తాం. యువత కు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఆటో డ్రైవర్ల ను వైసీపీ ప్రభుత్వం వేధిస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల కి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఇన్స్యూరెన్స్ ధరలు తగ్గేలా చేస్తాం. జగన్ పెంచిన పన్నులు తగ్గిస్తాం. వేధింపులు లేకుండా చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం.

 సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ…

వైసీపీ ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థ ను నాశనం చేసింది. సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాం. పంచాయతీ నిధులు అన్ని వైసీపీ ప్రభుత్వం కాజేసింది. 14, 15 ఆర్ధిక సంఘం ఇచ్చిన నిధులు జగన్ పక్కదారి పట్టించారు. ప్రజలు అభివృద్ది కోసం నిలదీస్తున్నారు. ఖాజానా లో ఒక్క రూపాయి లేదు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మా గ్రామాన్ని అభివృద్ది చెయ్యాలి. సర్పంచుల గౌరవం నిలబెట్టాలి.

ముసునూరు గ్రామస్తులు మాట్లాడుతూ…

గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. చిన్న వర్షానికే ఇబ్బందులు పడుతున్నాం. చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తికాక సాగునీరు అందడం లేదు. మా నియోజకవర్గంలో అభివృద్ది లేదు మా శాసనసభ్యుడు అవినీతి ఎక్కువ అయ్యింది. సంక్షేమం కార్యక్రమాల్లో కులం, మతం చూడను అన్నాడు జగన్. కానీ ఇప్పుడు కులం, మతం, పార్టీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. గ్రామంలో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. శాసనసభ్యుడు కనీసం గ్రామానికి రాడు. మా సమస్యలు పట్టించుకోడు. ఆటో నడుపుకునే వారికి 10 వేలు ఇస్తాను అని ఇన్స్యూరెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికేట్ ఛార్జీలు, ఫైన్లు విపరీతంగా పెంచి మమ్మల్ని జగన్ దోచుకుంటున్నాడు.

లోకేష్ ను కలిసిన పోతురెడ్డిపల్లి గ్రామస్తులు

నూజివీడు నియోజకవర్గం పోతురెడ్డిపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి, పిట్టలవారి పాలెం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించాలి. ఇవి పూర్తయితే మా గ్రామంలోని తాగు, సాగు నీటి సమస్య పరిష్కారమవుతుంది. TDP పాలనలో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణం వైసీపీ పాలనలో నిలిచిపోయాయి. మా గ్రామంలోని ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించాలి. గ్రామంలో శ్మశానాలు ఆక్రమణకు గురయ్యాయి, వాటిని కాపాడాలి. గ్రామంలో అర్హులకు పెన్షన్లు పార్టీలు చూసి ఇస్తున్నారు..ఈ విధానాన్ని రద్దు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

టిడిపి హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,294కోట్లు ఖర్చుచేస్తే, వైసిపి ప్రభుత్వం వచ్చాక నాలుగోవంతు ఖర్చుచేయలేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక చింతలపూడి ప్రాజెక్టు, పిట్టలవారిపాలెం వద్ద ఎత్తిపోతల నిర్మిస్తాం. గ్రామ ఎస్సీ కాలనీలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునరుద్ధరిస్తాం. ఎటువంటి పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కొర్లకుంట గ్రామస్తులు

నూజివీడు నియోజకవర్గం కొర్లకుంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక చిన్నపాటి జల్లులకే రోడ్లు జలమయమవుతున్నాయి. గ్రామంలోని గంగానమ్మ, అలివేలుమంగ, అక్కుపాటి కుంట, గోపాల చెరువులు కబ్జాకు గురయ్యాయి. చెరువులను రక్షించి రైతులకు సాగుకు అందుబాటులోకి తీసుకురావాలి. గ్రామంలోని శ్మశానాలను కూడా అధికారపార్టీ నేతలు ఆక్రమించారు. యాదవ కాలనీలో సీసీ రోడ్లు మంజూరు చేయాలి. చింతలపూడి ఎత్తిపోతల, పిట్టలవారిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిచేయాలి. గ్రామంలోని బీసీ, ఎస్సీలకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలి. గ్రామంలోని కోపరేటివ్ బ్యాంకులోని అవకతవకలు సరిచేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

పాలనలో వైసిపి దొంగలదెబ్బకు కొండలు, గుట్టలు, వాగులు, వంకలు మాయమైపోతున్నాయి. సహజ వనరులతో పాటు శ్మశానాలను కూడా వైసీపీ నేతలు వదలడం లేదు. పంచాయతీ నిధులు రూ.9వేల కోట్లు దారిమళ్లించి గ్రామీణాభివృద్ధిని అటకెక్కించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తాం. వైసీపీ పాలనలో నిలిపివేసిన అభివృద్ధి పనులను పూర్తిచేస్తాం.  చెరువులను కబ్జాదారుల కోరల నుంచి విముక్తి కల్పించి అభివృద్ధి చేస్తాం. ఇల్లు లేని ప్రతివాడికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం.

లోకేష్ ను కలిసిన సగర సామాజికవర్గ ప్రతినిధులు

నూజివీడు నియోజకవర్గం కొర్లకుంట పంచాయితీ చెక్కపల్లి క్రాస్ వద్ద సగర సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా కులం ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడింది. మా సగర కులాన్ని బీసీ-డి నుండి బీసీ-ఏ లోకి మార్చాలి. మా సామాజికవర్గంలో అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఇసుక సెస్ పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో 2శాతం సగర కార్పొరేషన్ కు కేటాయించాలి. రోడ్లు, భవనాల కాంట్రాక్టుల్లో మూడోవంతు పనులను మాకు కేటాయించాలి. మా సామాజికవర్గానికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి. ఉపర సోది, ఉప్పర మీటింగ్ అనే వ్యాఖ్యలపై నిషేధం విధించి మా ఆత్మగౌరవాన్ని కాపాడాలి. సగరులకు 50ఏళ్లకు పెన్షన్ సదుపాయం కల్పించాలి. రాజధాని ప్రాంతంలో సగర కులానికి కమ్యూనిటీ హాలు, స్కిల్ డెవలప్ మెంట్ సెంటరు ఏర్పాటు నిమిత్తం ఎకరం స్థలం కేటాయించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

కులానికొక కార్పొరేషన్ పెట్టి వాటిలో కుర్చీలు కూడా ఏర్పాటు చేయకుండా మోసం చేశాడు. కార్పొరేషన్ చైర్మన్లకు పదవులు అలంకారప్రాయమయ్యాయి..వీళ్లు తలెత్తుకోలేని పరిస్థితులు వచ్చాయి. బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.75,760కోట్లు జగన్ దారిమళ్లించి బీసీల నడ్డి విరిచాడు. టీడీపీ పాలనలో బీసీలకు ఆదరణ పథకం ద్వారా రూ.964కోట్ల విలువైన పనిముట్లు 90శాతం సబ్సిడీపై అందించాం. సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించి బీసీల అభ్యున్నతికి కృషి చేశాం. మేం అధికారంలోకి వచ్చాక బీసీ కార్పొరేషన్ ను బలోపేతం చేస్తాం. బీసీలకు శాశ్వత క్యాస్ట్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తాం. సగర సామాజికవర్గానికి జనాభా దామాషా ప్రకారం పదవులు, నిధులు కేటాయిస్తాం. బీసీ-డీ నుండి బీసీ-ఏ లోకి మార్చే అంశాన్ని పార్టీ పెద్దలతో చర్చిస్తాం. ఉప్పర సోది, ఉప్పర మీటింగ్ అనే పదాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అమరావతిలో సగర కమ్యూనిటీహాలుకు స్థలం కేటాయింపును పరిశీలిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ముసునూరు గ్రామస్తులు

గ్రామంలో 7 ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించి లబ్ధిదారులను అధికారపార్టీ మోసం చేసింది. ఇళ్ల స్థలాలు కేటాయించకుండా వేధిస్తున్నారు. రైతులకు 9గంటలు ఉచిత కరెంటు సరఫరా చేయాలి. పంచాయతీల్లోని పీడబ్ల్యూఎస్ మోటార్లకు 24గంటలు కరెంటు ఇవ్వాలి. డ్రైనేజీలతో కూడిన సీసీరోడ్లు ఏర్పాటు చేయాలి. రైతులకు యంత్రపరికరాలు, డ్రిప్ అందించాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందేలా చూడాలి. కౌలురైతులకు రుణాలు ఇప్పించాలి. వ్యవసాయ గోడౌన్లు నిర్మించి రైతులను ఆదుకోవాలి. విద్యుత్ ఛార్జీలపై నియంత్రణ ఉండేలా చూడాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ ప్రవేశపెట్టే ప్రతి స్కీము వెనుక ఓ పెద్ద స్కాము ఉంటోంది. పేదలకు సెంటుపట్టాల పథకం నుండి రూ.7వేల కోట్లను జగన్ దోచేశాడు. పేదలకు స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వమే ఇబ్బందులు పెట్టడం దుర్మార్గం. వైసీపీ పాలనలో అప్రకటిత కరెంటు కోతలతో రాష్ట్రమంతా చీకట్లు అలముకున్నాయి. వ్యవసాయానికి, పరిశ్రమలకు కరెంటు కోతలు శాపంగా మారాయి. రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3వస్థానం, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వ్యాపారాలతో వైసీపీ నేతలు రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మేం అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందిస్తాం…పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. నాణ్యమైన ఉచిత కరెంటు అందించి రైతు జీవితాల్లో వెలుగులు నింపుతాం. సీసీరోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తాం. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తాం. వ్యవసాయ గోడౌన్లు నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. విద్యుత్ ఛార్జీలను అదుపులోకి తెస్తాం..సామాన్యులను ఆదుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన ముసునూరు గ్రామ దళితులు

మా కాలనీల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీలు లేవు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించి చేయూతనివ్వాలి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను పటిష్టంగా అమలు చేయాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి న్యాయం చేయాలి. దళిత మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి. దళిత రైతులకు వ్యవసాయ పరికరాలు అందించి ఆదుకోవాలి. ఎస్సీ ఏరియాలో కళ్యాణమండపాలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలి. దళిత రైతుల పొలాల్లో ఉచిత బోర్లు వేయాలి. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో దళితులకు సమాన అవకాశాలు కల్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ పాలనలో దళితులు అడుగడుగునా దగాపడుతున్నారు. దళిత సంక్షేమ పథకాలు 27 రద్దు చేసి అన్యాయం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా దళితుల భూమి విస్తీర్ణం తగ్గిపోయింది. పేద దళితుల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమలుచేసిన అంబేద్కర్ విదేశీవిద్య పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో నిర్వీర్యం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యలు చేయడం నిత్యకృత్యంగా మారింది ఎస్సీ కాలనీల్లో పక్కా ఇళ్లు, డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు, కళ్యాణమండపాలు, కమ్యూనిటీహాళ్లు నిర్మిస్తాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను బలోపేతం చేస్తాం..దళితుల చేతుల్లో ఆయుధాల్లా మారుస్తాం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. దోషులను చట్టప్రకారం శిక్షిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ముసునూరు గ్రామ దళితులు

ముసునూరు గ్రామ దళితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా కాలనీల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీలు లేవు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించి చేయూతనివ్వాలి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను పటిష్టంగా అమలు చేయాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి న్యాయం చేయాలి. దళిత మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి. దళిత రైతులకు వ్యవసాయ పరికరాలు అందించి ఆదుకోవాలి. ఎస్సీ ఏరియాలో కళ్యాణమండపాలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలి. దళిత రైతుల పొలాల్లో ఉచిత బోర్లు వేయాలి. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో దళితులకు సమాన అవకాశాలు కల్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ పాలనలో దళితులు అడుగడుగునా దగాపడుతున్నారు. దళిత సంక్షేమ పథకాలు 27 రద్దు చేసి అన్యాయం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా దళితుల భూమి విస్తీర్ణం తగ్గిపోయింది. పేద దళితుల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమలుచేసిన అంబేద్కర్ విదేశీవిద్య పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో నిర్వీర్యం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యలు చేయడం నిత్యకృత్యంగా మారింది. టిడిపి అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. ఎస్సీ కాలనీల్లో పక్కా ఇళ్లు, డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు, కళ్యాణమండపాలు, కమ్యూనిటీహాళ్లు నిర్మిస్తాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను బలోపేతం చేస్తాం..దళితుల చేతుల్లో ఆయుధాల్లా మారుస్తాం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. దోషులను చట్టప్రకారం శిక్షిస్తాం.

Also Read This Blog :Step by Step: Walking Towards a Brighter Tomorrow with Yuvagalam

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *