Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
Naralokesh padayatra,Yuvagalam
Naralokesh padayatra,Yuvagalam

నూజివీడు నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం దారిపొడవునా యువనేతకు ప్రజల ఆత్మీయ స్వాగతం

నేడు ముసునూరు గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం

నూజివీడు: రాష్ట్రంలో లక్ష్యంగా  యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. 194వరోజు మీర్జాపురం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. భారీగజమాలలతో యువనేతను గ్రామాల్లోకి స్వాగతించారు. యువనేతతో ఫోటోలు దిగేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. యువనేత నారా లోకేష్ రాకతో నూజివీడులో జనసంద్రంగా మారింది.  నూజివీడు ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చేశారు. అందరినీ కలుస్తూ ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలతో బతుకు భారంగా మారింది. ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ వైసీపీప్రభుత్వం  మమ్మలని వేధిస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచిన పన్నులు, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.

పాదయాత్రకు అడ్డుంకులు సృష్టించేందుకు నూజివీడు శివార్లలో యువగళం పాదయాత్రపై రాళ్లు విసిరిన వైసీపీ పేటిఎం బ్యాచ్ రాళ్లు రువ్వి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించిన యువగళం కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు.  యువనేత లోకేష్ పాదయాత్ర దారిలో వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. ముస్లింలు, దళితులు, కిరాణా వ్యాపారులు, హామాలీ వర్కర్లు యువనేతను కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. మరికొద్దిరోజుల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అన్నివర్గాలకు అండగా నిలుస్తుందని చెప్పారు. నూజివీడులో మామిడిరైతులతో సమావేశమైన యువనేత లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. మీర్జాపురం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర గొల్లపల్లి, మోర్సపూడి, తుక్కులూరు, నూజివీడు మీదుగా పోతిరెడ్డిశివారు విడిది కేంద్రానికి చేరుకుంది. 194వరోజు యువనేత లోకేష్ 20 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2595.8 కి.మీ.ల మేర పూర్తయింది. శనివారంనాడు సింహాద్రిపురం వద్ద యువగళం పాదయాత్ర 2600 కి.మీ.ల మైలురాయికి చేరుకోనుంది. మధ్యాహ్నం  ముసునూరులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు.

యువనేత లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్

పేదల ఆకలి విలువ తెలుస్తుందా

ఇది నూజివీడులోని అన్నా క్యాంటీన్. తాను పేదలపక్షమనే చెప్పుకునే అన్నా క్యాంటీన్లను రద్దుచేసి వారి నోళ్లుకొట్టాడు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నాక్యాంటీన్లు ఏర్పాటుచేసి లక్షలాది పేదల ఆకలి తీర్చాం. అధికారంతోపాటు పదిమందికి సాయపడే గుణం కూడా ఉన్నవాడే నిజమైన పాలకుడవుతాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ద్వారా  లక్షలకోట్లు పోగేసుకుంటున్న జగన్ కు ఆకలిగొన్న అభాగ్యులకు పట్టెడన్నం పెట్టడానికి మాత్రం మనసు రావడం లేదు

ప్రాసెసింగ్ యూనిట్లతో మామిడిరైతులను ఆదుకుంటాం మామిడి పంటకు ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తాం

అధికారంలోకి వచ్చాక చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిచేస్తాం!

మామిడిరైతులతో ముఖాముఖిలో యువనేత నారాలోకేష్

నూజివీడు: రాష్ట్రంలో అధునాతన మామిడి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి కొత్త మామిడి రకాలు అభివృద్ది చేస్తాం. ఇతర దేశాలకు కావాల్సిన రకాలు కూడా ఇక్కడ పెంచే అవకాశాలు ఉన్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పల్పింగ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి మామిడి రైతులను ఆదుకుంటామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. నూజివీడులో మామిడిరైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… నూజివీడు ప్రాంతంలో ఉన్న రీసెర్చ్ సెంటర్ ని బలోపేతం చేస్తాం. మామిడి రైతులు దళారుల చేతిలో నష్టపోతున్నారు. మామిడి అమ్మకానికి మార్కెట్ లింక్ చేస్తాం. పెద్ద సంస్థల తో డైరెక్ట్ గా ఒప్పందం చేసుకొని రైతుకి లబ్ది జరిగేలా చూస్తాం. మామిడి పంట కి మెరుగైన ఇన్స్యూరెన్స్ పథకం అమలు చేయాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలు అధ్యయనం చేసి ఇక్కడ కూడా మామిడిపంటకు కి బీమా అమలు చేస్తాం. నూజివీడు, తిరువూరు, మైలవరం మామిడి రైతులకి లాభం వచ్చేలా స్థానికంగా మార్కెట్, కోల్డ్ స్టోరేజ్, రైపినింగ్ ఛాంబర్స్ ఏర్పాటు చేస్తాం. జ్యూస్ ఫ్యాక్టరీ కి కావాల్సిన మామిడి రకాలు వేరు. వాటిని పెంచడం ద్వారా ఫ్యాక్టరీలు ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఉంటుంది. నూజివీడు ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీల ఏర్పాటుకి కృషి చేస్తాం.

మోటార్లకు మీటర్లను ఒప్పుకోవద్దు

నూజివీడు మామిడి ప్రపంచం మొత్తం ఫేమస్.  మామిడి గిట్టుబాటు కాక రైతులు అంతా పామ్ ఆయిల్ వైపు మళ్లారు.  .రైతు భరోసా 12,500 ఇస్తానని కేవలం 7,500 ఇచ్చి మోసం చేసాడు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3 గా ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 2 గా ఉంది. రైతుల మోటార్లుకు మీటర్లు పెట్టాలని సైకో సిఎం ఆలోచిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని అంగీకరించొద్దు.

చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిచేస్తాం

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్  ప్రాజెక్టు ని  మొదటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. వైసీపీ  పాలనలో డ్రిప్ ఇరిగేషన్ ని నాశనం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రిప్ ఇరిగేషన్ అందిస్తాం. రైతు రథాలు, సూక్ష్మ పోషకాలు, ఇతర పనిముట్లు సబ్సిడీ లో అందజేస్తాం. మామిడి పంట ను ఉపాధి హామీ పథకంతో మొదటి మూడేళ్లు అనుసంధానం చేసే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా చేస్తాం.

పోలవరాన్ని నాశనం చేశారు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఏ జాతీయ ప్రాజెక్టు తొందరగా పూర్తి కాలేదు అందుకే పోలవరం బాధ్యత చంద్రబాబు గారు తీసుకొని 72 శాతం పూర్తి చేశారు .పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే ఒక మంత్రి బుల్లెట్ దిగిందా అంటాడు. ఇంకో మంత్రి అరగంట అంటాడు. పట్టిసీమను జగన్ దండగ అన్నాడు. మామిడి బోర్డు ఏర్పాటు పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

వైసీపీ ది హాలీడేల ప్రభుత్వం

వైసీపీ  పాలనలో క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, ఆక్వా హాలిడే చూస్తున్నాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కఠినమైన చట్టం తీసుకొస్తాం. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మే కంపెనీల పై చర్యలు తీసుకుంటాం. మామిడి ఉత్పత్తుల ఎక్స్ పోర్ట్ కోసం అవసరమైన డ్రైయర్లు సబ్సిడీ లో అందిస్తాం. వైసీపీ పాలనలో వ్యవసాయ శాఖ, మంత్రి ఉన్నారా అనే అనుమానం వస్తుంది . వైసీపీ బటన్ కి పవర్ పోయింది. అందుకే బటన్ నొక్కినా డబ్బులు పడటం లేదు.

ఇన్చార్జి ముద్రబోయిన వెంకటేశ్వర రావు మాట్లాడుతూ…

జాతీయ స్థాయిలో నూజివీడు మామిడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ మధ్య కాలంలో మామిడి రైతుల కష్టాలు వర్ణనాతీతం. వైసీపీ పాలనలో మామిడి రైతులకి ఎటువంటి సాయం అందడం లేదు. టిడిపి హయాంలో మొక్క, డ్రిప్, ఇన్పుట్ సబ్సిడీ అందించాం. మామిడి రైతులు అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మామిడి రైతుల కష్టాలు తీరుస్తాం.

మామిడి రైతులు మాట్లాడుతూ

మామిడి రైతుల పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. బంగినపల్లి మామిడి కిలో కి రూపాయి వచ్చిన దుస్థితి చూశాం. వైసీపీ పాలన లో మామిడి రైతులు పూర్తిగా కుప్పకూలిపోయాం. మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం. నూజివీడు, మైలవరం, తిరువూరు రైతులకి ఉపయోగపడేలా మార్కెట్ కావాలి. పొగాకు బోర్డు మాదిరి మామిడి కి కూడా బోర్డు పెడితే రైతులకి లాభం వస్తుంది. గ్రామం యూనిట్ గా ఇన్స్యూరెన్స్ కల్పించాలి. టిడిపి హయాంలో మామిడి రైతులకు డ్రిప్, ఫ్రూట్ కవర్, ఇతర పనిముట్లు సబ్సిడీ లో ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎటువంటి సాయం అందడం లేదు. వైసీపీ పాలనలో గిట్టుబాటు లేక రోడ్డు మీద పారబోసుకున్న రోజులు ఉన్నాయి. వైసీపీ పాలనలో పురుగుల మందులు, ఎరువుల ఖర్చులు ఎక్కువ అయ్యాయి. మామిడి పంట ను ఉపాధి హామీ పథకం తో అనుసంధానం చేస్తే మేలు జరుగుతుంది.

డ్రైయింగ్ యూనిట్లు పెట్టాలి

మామిడి పంటకు తెగుళ్లు రాకుండా టిడిపి హయాంలో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ కంట్రోల్ ఏర్పాటు చేశారు.  వైసీపీ పాలనలో ఎటువంటి సాయం లేక తీవ్రంగా నష్టపోతున్నాం. పల్ప్, డ్రై మామిడి, పౌడర్ ఉత్పత్తి చేసే యూనిట్లు పెడితే మామిడి రైతుకి మేలు జరుగుతుంది. జగన్ పాలనలో నకిలీ పురుగుల మందుల వలన 10 సార్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నాణ్యమైన విత్తనం, పురుగుల మందులు, ఎరువుల ఇవ్వాలి. జగన్ పాలనలో మామిడి పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. కొమ్మ కత్తిరింపు కి కూడా సాయం అందడం లేదు. డ్రిప్, మొక్కల సబ్సిడీ లేదు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల రేట్లు విపరీతంగా పెంచేశారు.

నారా లోకేష్ ను కలిసిన వేంపాడు గ్రామస్తులు

నూజివీడు నియోజడకవర్గం గొల్లపల్లి శివారు వేంపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామ అగ్రహారంలో 3,356.23 ఎకరాల ఈనాం భూములు ఉన్నాయి. గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో 5 గ్రామాలకు చెందిన 1,350 మందికి చెందిన భూములు  ఇక్కడ ఉన్నాయి. మా గ్రామం నేటికీ సర్వే సెటిల్ మెంట్ కి నోచుకోలేదు. మా గ్రామ భూ సమస్యలపై స్థానికేతర భూస్వాములు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు. రైతులను ఇబ్బందులు పెడుతున్న జీఓలు 79, 102లను రద్దు చేయించాలి. TDP అధికారంలోకి వచ్చాక మా గ్రామ భూ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

ఈనాం భూములకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సమస్యలున్నాయి. కేసులు కోర్టుల్లో ఉండి న్యాయపరమైన చిక్కుల కారణంగా దీర్ఘకాలంగా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఈనాం భూములకు సంబంధించి అధ్యయనం చేసి సముచితమైన నిర్ణయం తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన మోర్సపూడి ముస్లింలు

నూజివీడు నియోజకవర్గం మోర్సపూడి ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో సుమారు 150 ముస్లిం మైనారిటీ కుటుంబాలు ఉన్నాయి. మాకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. వైసీపీ ప్రభుత్వం దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేసింది. మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలి. గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు కొనసాగించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ ప్రభుత్వానికి ముస్లింల ఆస్తులపై ఉన్న శ్రద్ధ మైనారిటీల సంక్షేమంపై లేదు. వేలకోట్ల వక్ఫ్ ఆస్తులను వైసీపీ నేతలు యథేచ్చగా కబ్జా చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాల్నీ అమలుచేస్తాం. దుల్హాన్ పథకాన్నీ ఎటువంటి కొర్రీలు లేకుండా పేద ముస్లింలదరికీ వర్తింపజేస్తాం. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసి ముస్లింల ఆర్థిక స్వావలంబనకు కృషిచేస్తాం.  ఇల్లులేని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం.

*నారా లోకేష్ ను కలిసిన తుక్కులూరు గ్రామ దళితులు

నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు గ్రామదళితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో ఎస్సీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేసి మాకు ద్రోహం చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్ తొలగించారు. గురుకుల పాఠశాలలో వసతులు లేవు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఎస్సీ, ఎస్టీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

ఎన్నికల సమయంలో నా ఎస్సీలంటూ దళితులపై కపటప్రేమ ఒలకబోసిన ముఖ్యమంత్రి ఏరుదాటాక తెప్పతగలేసిన చందంగా వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్లుగా దళితులకోసం ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టని జగన్, గతంలో మేం అమలుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దుచేశారు.  దళితులకు చెందాల్సిన ఎస్సీ రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా దళితుల భూమి విస్తీర్ణం తగ్గిపోయింది. పేదదళితుల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమలుచేసిన అంబేద్కర్ విదేశీవిద్య పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో నిర్వీర్యం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యలు చేయడం నిత్యకృత్యంగా మారింది. టిడిపి అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. ఎస్సీలకు పక్కా ఇళ్లు, దళితవాడల్లో డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కిరాణా వ్యాపారులు

నూజివీడు పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద పట్టణ కిరాణా మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.  మేం నూజివీడు పట్టణంలో వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. మా పట్టణంలో మాల్స్, బ్రాండెడ్ కంపెనీల వల్ల మేం నష్టపోతున్నాం. అనేక సమస్యల మధ్య మా వ్యాపారాలు కొనసాగిస్తున్నాం. క్యారీబ్యాగులు ప్రజలకు నిత్యావసరంగా మారాయి. క్యారీబ్యాగులు ఉత్పత్తి చేసే వారిని నియంత్రించకుండా మమ్మల్ని అధికారులు ఇబ్బందిపెడుతున్నారు. మా ప్రాంతంలో బెల్లం అమ్మకం సమస్యగా మారింది. ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యాపారులపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. రెండు కేజీలకు మించి అమ్మకూడదు, అమ్మితే ఆధార్, సెల్ నంబర్ తీసుకోవాలంటున్నారు. నూజివీడును కృష్ణాజిల్లాలోనే కొనసాగించాలి. మీరు అధికారంలోకి వచ్చాక కిరాణా వ్యాపారుల సమస్యలను తొలగించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జె-ట్యాక్స్ విధానాల కారణంగా గత నాలుగేళ్లుగా వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వ్యాపారులు బెల్లం అమ్మకంపై ఆంక్షలు పెడుతున్న వైసీపీ.. ప్రాణాంతమైన జె-బ్రాండ్ల మద్యాన్ని మాత్రం విచ్చలవిడిగా అమ్ముతూ మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు. వైసిపి ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నించిన వ్యాపార ప్రముఖులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు బనాయించి జైలులో పెట్టారు. నంద్యాల మండీ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువీధి వెంకటసుబ్బయ్య కిరాతకంగా హత్యచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్వేచ్చగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తాం. ఉత్పత్తిచేసే ప్రాంతంలోనే క్యారీబ్యాగ్ లను కట్టడిచేసి, పేపర్, క్లాత్, ఇతర పర్యావరణహితమైన బ్యాగ్ లను అందుబాటులోకి తెస్తాం.

నారా లోకేష్ ను కలిసిన హమాలీ వర్కర్లు

నూజీవీడు పెద్దగాంధీ బొమ్మ సెంటర్ లో హమాలీ వర్కర్లు యువనేత నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఠాపనులు చేసుకునే జీవించే మాకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు భారంగా మారాయి. కూలీపనులు చేస్తేగానీ ఇల్లుగడవని మేము సొంత ఇళ్లులేక ఇబ్బంది పడుతున్నాం. హమాలీ వర్కర్లకు పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, కరెంటు చార్జీలు విపరీతంగా పెరిగాయి. టిడిపి అధికారంలోకి రాగానే ధరలను అదుపులోకి తెచ్చి ఉపశమనం కలిగిస్తాం. ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందిస్తాం. మహిళలకు ఆడబిడ్డనిధి కింద నెలకు రూ.1500 అందజేస్తాం. హమాలీ వర్కర్లకు చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేస్తాం.

Also Read This Blog :Footprints of Change: Yuvagalam’s Path to Empowerment

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *