NaraLokesh padayatra,Yuvagalam
NaraLokesh padayatra,Yuvagalam

సన్నబియ్యం సన్నాసిని రోడ్డుపై నడిపించే బాధ్యత నాది నాది వారానికి 3రోజులు సెలవుపెట్టే వీక్లీ ఆఫ్ యాత్ర కాదు

ఎవరి హయాంలో కృష్ణా జిల్లా అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధం

గన్నవరం బహిరంగసభలో నిప్పులు చెరిగిన నారా లోకేష్

గన్నవరం: గన్నవరం సమీపంలోని అవుటపల్లిలో జరిగిన భారీ బహిరంగసభలో యువనేత Nara Lokesh మాట్లాడుతూ. పుట్టిన గడ్డకి అన్యాయం చేస్తుంటే చప్పట్లు కొట్టిన మనకి నీతులు చెబుతున్నారు. పందికి అలాగే కృష్ణా జిల్లా వైసిపి నాయకులకు అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందా?.

కృష్ణాజిల్లా నేలపై పాదయాత్ర అదృష్టం

యువగళం..మనగళం..ప్రజాబలం. చిత్తూరు చిందేసింది, అనంతపురం అదిరిపోయింది, కర్నూలు కదం తొక్కింది, కడప కేక పుట్టింది , నెల్లూరు నాటు దెబ్బ సూపర్, ప్రకాశం లో జనసునామి, గుంటూరు గర్జించింది, ఇప్పుడు కృష్ణా జనసంద్రంగా మారిపోయింది. ఉద్యమాల వాడ బెజవాడ. అందరినీ చల్లగా చూసే దుర్గమ్మ ఆలయం ఉన్న పుణ్యభూమి కృష్ణా జిల్లా. మేరిమాత కొలువైన కొండ గుణదల. పాడిపంటలు, సిరులు అందించిన కృష్ణమ్మ పారే నేల కృష్ణా జిల్లా. ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ జెండా తయారు చేసిన పింగళి వెంకయ్య ఈ భూమి పై పుట్టారు. తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విశ్వవిఖ్యాత స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారు జన్మించిన గడ్డ కృష్ణా జిల్లా. ప్రకాశం బ్యారేజీ గేట్ల‌న్న ఒకేసారి ఎత్తిన‌ట్టు.. యువ‌గ‌ళం జ‌న ప్రవాహంలా పొంగింది.  కృష్ణా జిల్లా మనవడిగా, అల్లుడిగా ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

భయం మా బ్లడ్ లో లేదు

జగన్ పాదయాత్ర చేసినప్పుడు మనం అడ్డుకోలేదు. సెక్యూరిటీ పెంచి పాదయాత్ర చేసుకోమని చెప్పాం. కానీ మీ లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన వెంటనే గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పోలీసుల్ని పంపాడు మనం తగ్గేదేలేదు అన్నాం.  మైక్ వెహికల్ లాక్కున్నాడు. మా తాత ఎన్టీఆర్ గారి గొంతు ఇది.  ఇప్పుడు మళ్లీ ఫ్లెక్సీ కట్టనివ్వం, బ్యానర్లు చింపుతాం, సెక్యూరిటీ ఇవ్వం అంటున్నారు సన్నాసులు.  బ్రదర్  భయం నా బ్లడ్ లో లేదు. అడ్డు వస్తే తొక్కుకుంటూ పోతాం. నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర..అడ్డుకుంటే దండయాత్ర.

 దమ్ముంటే బిల్లులపై స్టిక్కర్లు వేయాలి

అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు.

మహిళల కన్నీళ్లు తుడిచేందుకే మహాశక్తి

2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.

యువత భవితను దెబ్బతీసిన వైసీపీ

వైసీపీ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు.  యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3వేలు ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ ఇద్దరు పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు. పేద వారి బిడ్డలు విదేశాల్లో చదవకూడదా?విదేశీ విద్య తిరిగి ప్రారంభిస్తాం.

రోజుకు నలుగురు రైతుల ఆత్మహత్యలు

వైసీపీ రైతులు లేని రాజ్యం ఏర్పడింది. ఒకే రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు  రైతు భరోసా, పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ రుణాలు, ధాన్యం కొనుగోళ్లు అన్ని నాశనం చేసాడు. వైసీపీ పాలనలో క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే, పవర్ హాలిడే.  రైతుల బాధలు చూసాను . టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల్ని ఆదుకోవడానికి ప్రతి ఏడాది రూ.20 వేలు ఇస్తాం.

ఒకటో తేదీన జీతమిస్తే చాలు

వైసీపీ నిన్న ఏపీ ఎన్జీఓలతో మీటింగ్ పెట్టుకున్నాడు. మీ సంతోషం, మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నాడు. ఒకటో తారీఖున జీతం ఇచ్చే దిక్కులేదు, 200 వారాలు అయినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కోతపెట్టాడు జగన్. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు.  ఎస్ఐ కి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్ కి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేసాడు. వైసీపీ  తెచ్చిన జిఓ 79 రద్దు చేస్తాం. TDP అలవెన్స్ యధాతధంగా ఇస్తాం.

బిసిలు, దళితులకు వేధింపులు

బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ వైసీపీ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు.  మొన్నే కడియం లో ఒక్క దారుణమైన ఘటన జరిగింది. దళిత యువకుడు వెంకట ప్రసాద్ ని ఒక కేసు లో ఇరికించి స్టేషన్ కి తీసుకెళ్లి చితకబాదారు. తాగడానికి నీళ్లు అడిగితే ప్రసాద్ నోట్లో మూత్రం పోసాడు 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. వైసీపీ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.

మైనారిటీలకూ చిత్రహింసలు

వైసీపీ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.

కృష్ణాజిల్లాను అభివృద్ధి చేసింది టిడిపి!

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సిసి రోడ్లు, డబుల్ రోడ్లు, రోడ్ల విస్తరణ, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, స్మశానాలు అభివృద్ధి, సాగు, తాగు నీటి ప్రాజెక్టులు నిర్మించింది టిడిపి. విజయవాడ లో వందల కిలోమీటర్ల వరద కాలువల పనులు చేపట్టాం. కృష్ణా వ‌ర‌ద ముప్పు త‌ప్పించేందుకు రూ.164 కోట్లతో కృష్ణలంక రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టాం. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గ ప్రజలకు తాగు నీరుతో పాటు 4.90 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రూ.4,909 కోట్లతో గోదావరి నీటిని పంపింగ్‌ చేసి కృష్ణ జిల్లాకు తరలించేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాం. ఆ పనులు నిలిచిపోయాయి.  మనం పట్టిసీమ కడితే జగన్ దండగ అన్నాడు

ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా మార్చాం

దుర్గమ్మ ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, రోడ్లు విస్తరణ చేసింది టిడిపి. బస్టాండ్ లా ఉన్న విమానాశ్రయాన్ని ఆంతర్జాతీయ విమానాశ్రయం గా మార్చాం. వైసీపి వాళ్ళకి కనీసం ఎయిర్పోర్ట్ ముందు మొక్కలు పెంచడం కూడా రాదు. పేదలకు టిడ్కో ఇళ్లు నిర్మించింది టిడిపి.  ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకొని ఏళ్లుగా ఉంటున్న పేదలకు పట్టాలు ఇచ్చింది చంద్రబాబు. విజయవాడ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభిస్తే జగన్ ఆ పనులు ఆపేసాడు.

కృష్ణాజిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధం

ఇబ్రహీంపట్నం ఎన్టీపీఎస్ కాంట్రాక్టు కార్మికులు 1300 మందికి రెగ్యులరైజ్ చేస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చి మరిచిపోయాడు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తానని చేశాడా? సుబాబుల్, మామిడి, మిరప, పత్తి రైతుల్ని ఆదుకుంటా అన్నాడు. ఆదుకున్నాడా? ఇప్పుడు మోటర్లకి మీటర్లు బిగించి షాక్ ఇస్తున్నాడు. వైసిపి నాయకులకు నేను సవాల్ విసురుతున్నా. 15 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు వస్తారో రండి, టైం అండ్ డేట్ మీరే ఫిక్స్ చేయండి. సింగిల్ గా వస్తా. ఎవరి హయాంలో కృష్ణా జిల్లా అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం.

16సీట్లివ్వండి…అభివృద్ధిచేసి చూపిస్తాం!

గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా లో 14 సీట్లు వైసిపి కి ఇచ్చారు. వైసీపీ  చేసింది ఏంటి చేతిలో చిప్ప పెట్టాడు. ఉమ్మడి కృష్ణా జిల్లా లో 16 కి 16 సీట్లు టిడిపి కి ఇవ్వండి. టిడిపి గెలిచిన వెంటనే చింతలపూడి ప్రాజెక్టును పూర్తిచేసి నాగార్జునసాగర్ కాలువల ద్వారా గోదావరి జలాలను తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ నియోజకవర్గ సాగుకి అంద‌జేస్తాం. తిరువూరు నియోజకవర్గ రైతాంగానికి జీవనాధారమైన  పిట్టలవారి గూడెం ప్రాజెక్టును పూర్తిచేస్తాం. ఎ.కొండూరులో కిడ్నీ బాధితులు పెరిగిపోయారు. ఇంటింటికీ సుర‌క్షిత‌మైన నీరు అందించి కిడ్నీ స‌మ‌స్య‌లు రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తాం. జిల్లా లో ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ పధకంలో భాగంగా కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం.

అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తాం

టిడిపి అధికారంలోకి వచ్చాక సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. పేద‌లంద‌రికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. మామిడి, పత్తి, మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకుంటాం. పెడన చేనేత కార్మికుల‌ని ఆదుకునేందుకు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తాం.  మచిలీపట్నం వాసుల చిరకాల స్వప్నం బందర్ పోర్టు పనులను పూర్తి చేస్తాం. కృష్ణాడెల్టా చివరి ఆయకట్టు వరకు రైతాంగానికి సాగునీరు అందిస్తాం. విజయవాడ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తాం. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. టిడిపి కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. పార్టీ కోసం కష్టపడిన వారిని గుండెల్లో పెట్టుకుంటా.  టిడిపి నాయకులు, కార్యకర్తల్ని వేధించిన వారు కృష్ణా జిల్లా లో ఉన్నా విదేశాలకు పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తాం. చట్టాలు అతిక్రమించి వ్యవహరించిన అధికారుల పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.

Also Read This Blog :Walking the Path of Change: Nara Lokesh’s Yuvagalam Padayatra

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *