NaraLokesh padayatra,Yuvagalam
NaraLokesh padayatra,Yuvagalam

గన్నవరంలో యువగళానికి జనం బ్రహ్మరథం అడుగడగునా యువనేతకు నీరాజనాలు

నేడు అవుటపల్లి బహిరంగసభలో లోకేష్ ప్రసంగం

గన్నవరం: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు గన్నవరంలో జనం బ్రహ్మరథం పట్టారు. 190వరోజు యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా యువనేత లోకేష్ కు సంఘీభావంగా జనం భారీగా రోడ్లపైకి వచ్చారు. మహిళలు హారతులు పడుతూ, దిష్టితీస్తూ యువనేతను స్వాగతించారు.  భారీ గజమాలలతో అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. యువగళం పాదయాత్ర సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో గన్నవరం రహదారులు కిక్కిరిసిపోయాయి. వివిధవర్గాల ప్రజలు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.  పెరిగిన నిత్యావసరాల ధరలు, విద్యుత్ చార్జీలు భారంగా మారయని ఆవేదన వ్యక్తంచేశారు.  మరికొద్దినెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం ధరలను అదుపుచేస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు. యువనేతతో ఫోటోలు దిగేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. నిడమానూరు నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర గూడవల్లి సెంటర్, కేసరపల్లి, గన్నవరం ఎయిర్ పోర్టు, గన్నవరం చెరువు, గాంధీబొమ్మ సెంటర్ మీదుగా చినఅవుటపల్లిలోని విడిది కేంద్రానికి చేరుకుంది. యువనేత వెంట నూతనంగా పార్టీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు, ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, పంచుమర్తి అనూరాధ, బోండా ఉమ తదితరులు ఉన్నారు. 190వరోజు యువనేత లోకేష్ 13.7 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2539.5 కి.మీ. మేర పూర్తయింది. మంగళవారం సాయంత్రం అవుటపల్లిలో నిర్వహించే భారీ బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగించనున్నారు.

సబ్ ప్లాన్ తో బిసిలకు న్యాయం చేసింది టిడిపి! బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం

అధికారంలోకి వచ్చాక శాశ్వత కులధృవీకరణ పత్రాలు

బిసిలతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

గన్నవరం: బిసిలను పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి బిసి సబ్ ప్లాన్ ఏర్పాటుచేసింది టిడిపి. బిసిలకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది, కీలకమైన పదవులు, శాఖలు బిసిలకు ఇచ్చింది టిడిపి. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు, జనతా వస్త్రాలు, ఆదరణ పథకం పెట్టింది టిడిపి అని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గం నిడమానూరు శివారు క్యాంప్ సైట్ లో  బిసి సామాజికవర్గ ప్రతినిధులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చే నిధులు బిసిల ఖాతాలో రాస్తున్నాడు. మేము ఆ తప్పు చెయ్యం. బిసిల ను పేదరికం నుండి బయటకు తీసుకొచ్చే విధంగా సబ్సిడీ రుణాలు ఇస్తాం. టిడిపి హయాంలో కుల వృత్తులను కాపాడటానికి ఆదరణ పథకం అమలు చేసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం. దామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికన ప్రత్యేక స్మశానాలు ఏర్పాటుకు భూములు కేటాయిస్తాం.

బిసిలపై తప్పుడు కేసులతో వేధింపులు

అధికారంలోకి వచ్చాక కీలక పదవులు అన్ని ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. బిసిలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బిసిలపై 26వేల తప్పుడు కేసులు బనాయించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. జగన్ పాలనలో బిసిలకు 10 శాతం రిజర్వేషన్లు రద్దు చేశాడు. టిడిపి హయాంలో అన్ని కీలక పదవులు బిసిలకు ఇచ్చాం. ఒక్క సారి బిసిలు అంతా ఆలోచించాలి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం తీసుకొస్తాం. కుల వృత్తులు కాపాడటమే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ, అధునాతన పనిముట్లు అందజేస్తాం.

దామాషా ప్రకారం ఉపకులాలకు నిధులు

ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి. నిధులు కేటాయించింది టిడిపి. నిధులు, విధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసాడు. బిసి శాఖ మంత్రి పేషి లో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి పాలనలో ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన దామాషా ప్రకారం ఉప కులాలకు నిధులు కేటాయిస్తాం.. అలాగే ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారిని కూడా రెగ్యులరైజ్ చేస్తానని మోసం చేసాడు. దీని పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం తల నీలాలపై వచ్చే ఆదాయంలో పది శాతం నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం. వైసీపీ పాలనలో గీత కార్మికులు సంక్షోభంలో ఉన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న భీమా పథకాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేస్తాం. నీరా కేఫ్ లు ప్రారంభిస్తాం. లిక్కర్ షాపుల్లో వాటా కల్పిస్తాం.

టిడిపి వల్లే బిసిలకు న్యాయం

వైసీపీ బిసిల గురించి మాట్లాడుతున్నాడు అంటే దానికి కారణం టిడిపి.  చిత్తూరు జిల్లాలో నా మీటింగ్ లో కూర్చున్న వ్యక్తిని తీసుకెళ్ళి ఎమ్మెల్సీ ఇచ్చాడు టిడిపి హామీ ఇవ్వక పోయినా దువ్వారపు రామారావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చాం. వైసిపి వాళ్లు దోబీ ఘాట్స్ కబ్జా చేస్తున్నారు. టిడిపి హయాంలో దోబి ఘాట్స్ అభివృద్ది చేసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యువత కు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.

మాజీమంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ…

కుల వృత్తులను కాపాడింది టిడిపి. కుల వృత్తులను ఆదరణ పథకం తీసుకొచ్చి రక్షించింది చంద్రబాబు గారు. ఉప కులాలకు కూడా న్యాయం జరగాలి అని సాధికార సమితి లు ఏర్పాటు చేసింది నారా లోకేష్. జగన్ ప్రభుత్వం బిసి సామాజిక వర్గం ప్రతినిధులను వేధిస్తుంది.

ముఖాముఖి సమావేశంలో బిసిలు మాట్లాడుతూ…

  బిసి సర్టిఫికేట్లు రాక ఇబ్బంది పడుతున్నాం. బిసి యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నాం.. దేవాలయాల్లో పనిచేసే మమ్మలని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసాడు. మీరు మాకు న్యాయం చెయ్యాలి. నాయి బ్రాహ్మణులకు ఆరోగ్య భద్రత, ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. గీత కార్మికులకు జగన్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. వృత్తి, ఆరోగ్య భద్రత కల్పించాలి. రజక సోదరులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దేవాలయాల్లో దోబి పనులు రజకులు ఇవ్వాలి.

చేతివృత్తుల ప్రదర్శన

నిడమానూరు శివారు క్యాంప్ సైట్ బిసి సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సందర్భంగా వివిధ చేతివృత్తిదారులు తాము తయారుచేసే వస్తువుల ప్రదర్శనను ఏర్పాటుచేశారు.  కుల వృత్తులవారి ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించి వారు పడుతున్న కష్టాలను యువనేత అడిగి తెలుసుకున్నారు. రజక, నూర్ బాషా – దూదేకుల, కుమ్మరి, నాయి బ్రాహ్మణ, ఎం. బి. సి, మహేంద్ర, యాదవ, మత్స్యకార, ముదిరాజ్, వడ్డెర, విశ్వ బ్రాహ్మణ, సగర, కలంకారీ, చేనేత కుల వృత్తుల ప్రదర్శనలను ఏర్పాటుచేశారు. ప్రతి స్టాల్ దగ్గరా ఆగి వారు ఎదుర్కుంటున్న సమస్యలు, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చెయ్యాల్సిన సంక్షేమ కార్యక్రమాల గురించి కులవృత్తి దారుల అభిప్రాయాలను తీసుకున్నారు.

నారా లోకేష్ ను కలిసిన రజక సామాజికవర్గీయులు

గన్నరం నియోజకవర్గ రజకులు గూడవల్లి సెంటర్ లో యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభలో అసెంబ్లీ సీట్లు రజకులకు కేటాయించాలి. రజకులకు రక్షణ చట్టం అమలు చేయాలి. రజక వృత్తిదారుల్లో 50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో దోబీ పోస్టులు, కాంట్రాక్టులకు రజకులకు ఇవ్వాలి. అపార్ట్ మెంట్ వాచ్ మెన్లో రజకులకు 90 శాతం పైబడి ఉన్నారు..వారికి కనీస వేతన రూ.15 వేలు ఇవ్వాలి..వాచ్ మెన్ లకు రెండు గదులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. గతంలో జిఓ నెం.343 జీవో ప్రకారం గ్రామాల్లో రజకులకు చెరువులు కేటాయించారు, అవి ఆక్రమణలకు గురవతున్నాయి. వాటిని పరిరక్షించాలి.  పట్టణాల్లో దోబీఘాట్ లు దురాక్రమణకు గురవుతున్నాయి, వాటిని కాపాడాలి. భూమి కొనుగోలు పథకంలో పేద రజకులకు ప్రభుత్వం ద్వారా భూమి కొనుగోలుచేసి ఇవ్వాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

వైసీపీ అధికారంలోకి వచ్చాక బిసిలపై అణచివేత చర్యలు తీవ్రమయ్యాయి. తమహక్కుల కోసం ప్రశ్నించిన బిసిలపై వైసిపి గూండాలు దాడులకు తెగబడుతున్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 26వేలమంది బిసిలపై తప్పుడు కేసులు బనాయించారు. కుర్చీల్లేని కార్పొరేషన్లు ఏర్పాటుచేసి రజకులకు రాజకీయంగా ప్రాధాన్యతనిచ్చింది TDP నే. దువ్వారపు రామారావుకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాం. అధికారంలోకి వచ్చాక బీసీ రక్షణ చట్టంతో రజకులతోపాటు బిసిలందరికీ రక్షణ కల్పిస్తాం.  ప్రభుత్వ రంగ సంస్థల్లో దోబీ పోస్టులు, దోబీ కాంట్రాక్టులు రజకులకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో చెరువులను కబ్జా చేసిని వారిపై చర్యలు తీసుకుని, వాటిని తిరిగి అప్పగిస్తాం. పట్టణాల్లో దోబీఘాట్లు దురాక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.

లోకేష్ ను కలిసిన గన్నవరం విమానాశ్రయ భూ నిర్వాసితులు

గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు.  కేసరపల్లి, బుద్ధవరం, అల్లాపురం, చిన్నఅవుటపల్లి, అజ్జంపూడి గ్రామాల నుండి విమానాశ్రయ విస్తరణకు 15-09-2015లో 5 గ్రామాల్లో  సీఆర్డీఏ ద్వారా తొలుత 700 ఎకరాలు, తర్వాత 52.74 ఎకరాలను సేకరించారు. భూములిచ్చినందుకు ప్రతిఫలంగా రాజధాని అమరావతిలో ఒక్కో ఎకరాకు1450 చ.గ. లు కేటాయిస్తామని ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది.  కొందరు రైతులకు రాజధానిలో లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించగా, వారు వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకా కొంతమంది రైతులకి కనీసం ప్లాట్లను కూడా కేటాయించలేదు, మరికొంతమంది రైతుల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. ప్రభుత్వం సమీకరించిన భూమి మొత్తం స్వాధీనం చేసుకొని చుట్టూ ప్రహరీగోడ కట్టి, విమానాశ్రయ రన్ వేని విస్తరించారు.  మాకు ఇవ్వవలసిన వార్షిక కౌలు మాత్రం ఇవ్వడం లేదు. చాలామంది రైతులకు 7 సంవత్సరాల నుండి కౌలు రావలసి ఉంది. భూమి ఇచ్చిన వారిలో చాలామంది సన్నకారు రైతులైనందున ఆర్థికంగా ఎన్నో కష్టనష్టాలు, మానసిక వేదనకు గురవుతున్నాము.  మా సమస్యలపై న్యాయస్థానంలో  కేసులు కూడా వేయడం జరిగింది. ఆర్డీవో, ఎమ్మార్వో, సీఆర్డీఏ కమీషనర్, కలెక్టర్ ను ఎన్నిసార్లు కలిసి విన్నవించినా స్పందన రావడం లేదు. రైతులకు రాజధానిలో కేటాయించబడిన ప్లాట్లు ఎక్కడ ఉన్నవో కూడా తెలియడం లేదు. వాటికి సరైన బాటగాని,  మౌలిక సదుపాయాలు గానీ లేవు.  మూడు రాజధానుల ప్రకటన తర్వాత అక్కడ ప్లాట్లను అభివృద్ధి చేయకపోవడం వల్ల సరైన విలువ కూడా లేకుండా పోయింది. దయచేసి మా సమస్యలను అర్ధం చేసుకుని మమ్మల్ని కాపాడవలసిందిగా విన్నవించుకొంటున్నాము.

నారా లోకేష్ మాట్లాడుతూ

 రైతులు భూములివ్వడం వల్లే గన్నవరం ఎయిర్ పోర్టు అంతర్జాతీయ స్థాయికి విస్తరించడానికి ఆనాడు సాధ్యమైంది. నవ్యాంధ్ర రాజధానికి రాకపోకలు గన్నవరం విమానాశ్రయం గుండానే సాగుతున్నాయి. వైసిపి అధికారంలోకి వచ్చాక విమానాశ్రయ భూముల్లో కూడా ఇక్కడున్న పిల్ల సైకోలు గ్రావెల్ తవ్వకాలకు తెగబడ్డారు. విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు రాజధానిలో చంద్రబాబు స్థలాలు కేటాయించారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూమిలిచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  టీడీపీ అధికారంలోకి రాగానే గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులకు రాజధానిలో ఫ్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాం.  ఫ్లాట్లు కేటాయించిన ప్రాంతంలో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తాం. రైతులకు ఇవ్వాల్సిన కౌలు మొత్తాన్ని వడ్డీతో సహా అందజేస్తాం.

 నారా లోకేష్ ను కలిసిన గన్నవరం ప్రజలు

గన్నవరం ఊరచెరువు వద్ద స్థానిక ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గన్నవరం పట్టణంలో డంపింగ్ యార్డ్ లేదు. పంచాయతీ వారు చెత్తనంతా రోడ్డకిరువైపులా పడేయడం వల్ల దోమలు, పందులతో ఇబ్బంది పడుతున్నాం. గన్నవరం నుంచి చుట్టపక్కల గ్రామాలకు వెళ్లేందుకు చెత్త, చెదారం తీవ్ర అవరోధంగా ఉంది. గన్నవరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు రోడ్లపై చేరి ఇబ్బందులు పడుతున్నాం. గన్నవరం జనాభాకు తగ్గట్లుగా ప్రజలకు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నాం.  పట్టిసీమకు పోలవరం కాలువ ద్వారా వచ్చే గోదావరి నీటిని కోనాయి చెరువుకు మళ్లించి తాగునీటి సమస్య తీర్చాలి. ఊర చెరువు పట్టణం మధ్యలో ఉన్నందున మురుగునీరు దానిలోకి చేరడంతో చుట్టుపక్కల వాసులు అవస్థలు పడుతున్నారు. ఊర చెరువును బాగుచేసి ఉపయోగకరంగా తీర్చిదిద్దాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

గన్నవరం ఎమ్మెల్యేకు అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంపై లేదు. తమను ఎన్నుకున్న ప్రజలకు కనీసం గుక్కెడు నీళ్లందించలేకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనం. టిడిపి అధికారంలోకి వచ్చాక కోనాయి చెరువుకు గోదావరి నీటిని మళ్లించి తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. గన్నవరం శివార్లలో డంపింగ్ యార్డు ఏర్పాటుచేసి పట్టణ ప్రజల ఇబ్బందులను తొలగిస్తాం. గన్నవరం ఊరచెరువును బాగుచేసి మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతాం. డ్రైనేజీ సమస్యను పరిష్కరించి గన్నవరం పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతాం.

నారా లోకేష్ ను కలిసిన గన్నవరం న్యాయవాదులు

గన్నవరం గాంధీబొమ్మ సెంటర్ లో న్యాయవాదులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత నాలుగేళ్లుగా అడ్వకేట్స్ పై దాడులు జరుగుతున్నాయి…అడ్వకేట్ యాక్ట్ ద్వారా రక్షణ కల్పించాలి. గన్నవరం ఎమ్మెల్యే బాధితులకు ఏ సమస్య వచ్చినా జూనియర్స్ మేము వారి తరపున న్యాయస్థానాల్లో పోరాడుతున్నాం.  దీంతో ఎమ్మెల్యే అడ్వకేట్స్ ను బెదిరిస్తూ సీనియర్స్ మాకు సహకరించకుండా బెదిరిస్తున్నాడు. గన్నవరంలో 4 కోర్టులున్నాయి, అద్దె బిల్డింగుల్లో కొనసాగుతున్నందున మీ ప్రభుత్వం రాగానే కోర్టుకు సొంత భవనాలు నిర్మించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

బాధితుల పక్షాన న్యాయంకోసం పోరాడే న్యాయవాదులపై దాడులకు దిగడం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చాక న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొస్తాం.  అడ్వకేట్లపై బెదిరింపులకు పాల్పడే అరాచకశక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గన్నవరంలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

Also Read This Blog:Youth-Centric Politics: Exploring Nara Lokesh’s Yuvagalam Padayatra

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *