Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
NaraLokesh padayatra,Yuvagalam
NaraLokesh padayatra,Yuvagalam

బెజవాడలో జాతరను తలపించిన యువగళం*

జనసంద్రంగా మారిన విజయవాడ నగరం

గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర

విజయవాడ: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవాడలో జాతరను తలపించింది. 189వరోజు పాదయాత్ర విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్ నుంచి ప్రారంభమైంది. యువనేతకు సంఘీభావంగా మహిళలు, యువతీయువకులు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు.  అడుగడుగునా బెజవాడ ప్రజలు యువనేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను లోకేష్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. రోడ్డు డివైడర్లు, భవనాలపైకి ఎక్కి నగర ప్రజలు యువనేతకు అభివాదం తెలిపారు. యువనేతను కలిసి ఫోటోలు దిగేందుకు యువతీయువకులు, మహిళలు పోటీపడ్డారు.  పెరిగిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు మోయలేనివిధంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. కృష్ణానది చెంతనే ఉన్నా ఇసుక అందుబాటులేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. మరికొద్ది నెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు.  భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను ప్రజలకు పంచుతూ చంద్రబాబు ప్రకటించిన పథకాల ప్రయోజనాలను వివరించారు. పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులో నిరుద్యోగ యువత వినూత్న ప్రదర్శన నిర్వహించారు. భిగించుకుని ప్రదర్శన చేశారు. సంవత్సరాలు వస్తూ పోతూ ఉన్నాయ్ కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ర్రావట్లేదంటూ లోకేష్ యువగళానికి మద్దతు తెలిపారు. గత 4ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన గ్రూప్, పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలు సున్నా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలంటూ యువగళానికి సంఘీభావం తెలిపారు. ఎ కన్వెన్షన్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర డివి మేనర్, లలితా జ్యుయలర్స్, ఎన్టీఆర్ సర్కిల్, పటమట సెంటర్, ఆటోనగర్ గేట్, వంద అడుగుల రోడ్డు, పెనమలూరు నియోజకవర్గం సనత్ నగర్, తులసీనగర్, కానూరు, కామయ్యతోపు, సిద్ధార్థ కాలేజి, పోరంకి మీదుగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని నిడమానూరు క్యాంప్ సైట్ కి చేరుకుంది.  యువనేత వెంట తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు, గద్దే అనూరాధ, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, పార్టీ నేతలు వంగవీటి రాధా, పెనమలూరు ఇన్ చార్జి బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవి రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. 189వరోజు యువనేత లోకేష్ 16 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2525.8 కి.మీ.ల మేర పూర్తయింది. సోమవారం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది.

అధికారంలోకి వచ్చాక ట్రాన్స్ పోర్టు కార్మికులకు కార్పొరేషన్

ఆటో నగర్ ల అభివృద్ది కి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తాం

పన్నులు, విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఉపశమనం కలిగిస్తాం

ఆటోనగర్ ట్రాన్స్ పోర్టు రంగ ప్రతినిధులతో యువనేత లోకేష్

విజయవాడ: ఆటో నగర్ లని ప్రైవేట్ పరం చేసి భూములు కొట్టేయాలని వైసిపి నాయకులు ఏకంగా జిఓ తీసుకొచ్చారని యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో నగర్లు, ట్రాన్స్ పోర్ట్ రంగం పై ఆధారపడిన వారిని, కార్మికులను ఆదుకోవడానికి  ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. కార్పొరేషన్లు బలోపేతం చేసి వాహనాలు కొనుగోలు చెయ్యడానికి సహకారం అందిస్తామని తెలిపారు. విజయవాడ ఏ కన్వెన్షన్ విడిది కేంద్రం వద్ద ఆటో నగర్, రవాణా రంగం ప్రతినిధులు, కార్మికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… వైసీపీ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపి దేశంలోనే నంబర్ 1.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రోడ్లు వేస్తాం. వైసీపీ పాలనలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. దీనివల్ల కూడా ట్రాన్స్ పోర్ట్ రంగం పై విపరీతమైన భారం పడుతుంది. కనీసం రోడ్ల పై ఉన్న గుంతలు పూడ్చే దిక్కు లేదు.

విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తాం

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తాం. ఆటో నగర్ ల అభివృద్ది కి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తాం. అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం. విజయవాడ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఆటో నగర్ లలో సగం భూమి కొట్టేయాలని తెచ్చిన జీఓ లు మొత్తం రద్దు చేస్తాం. టెక్నాలజీ చాలా స్పీడ్ గా మారుతోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మెకానిక్ లకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం. అవసరమైన పనిముట్లు కొనుగోలు చేసేందుకు సహకారం అందిస్తాం. నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం

కరోనా సమయంలో పనులు లేక ఆటో నగర్ లో కార్మికులు, యజమానులు ఇబ్బంది పడ్డారు, ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పన్నులు తగ్గించి ఇతర రాష్ట్రాలతో మన ట్రాన్స్ పోర్ట్ రంగం పోటీ పడే విధంగా చేస్తాం. అన్ని రాష్ట్రాల కంటే కనీసం రూపాయి తక్కువ పన్ను ఉండేలా చేస్తాం. ఆటో నగర్, ట్రాన్స్ పోర్ట్ రంగంపై ఆధారపడిన కార్మికులు ఇన్స్యూరెన్స్, ఆరోగ్య భద్రత కోసం చర్యలు తీసుకుంటాం.

చైతన్యరథం తయారైంది ఇక్కడే!

ఆటోనగర్ కి గొప్ప చరిత్ర ఉంది. మేము అంబాసిడర్ కొన్నప్పుడు ఆటో నగర్ లోనే అప్ గ్రేడ్ చేయించాం. అంబాసిడర్ కారు ని ఆటోమేటిక్ కారు గా మార్చిన నైపుణ్యం ఆటోనగర్ కార్మికులది. ఆటోనగర్ లో ఎంతో మంది నైపుణ్యం ఉన్న కార్మికులు ఉన్నారు. చైతన్య రథం తయారు చేసిన ఆటో నగర్ ని నేను మర్చిపోను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో నగర్ లను అభివృద్ది చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీకు కావాల్సిన పాలసీలు ఇస్తాం. రిటర్న్ గిఫ్ట్ గా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించండి.

రవాణారంగ ప్రతినిధులు, కార్మికులు మాట్లాడుతూ…

దేశంలో మొదటి ఆటోనగర్ విజయవాడ లో ఏర్పాటు చేశారు. ఆసియా లోనే ఇది అతి పెద్ద ఆటో నగర్. ఎన్టీఆర్ గారి చైతన్య రథం కూడా ఇక్కడే తయారైంది. గతంలో రూ.200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ ని రూ.26,816 చేశారు. ఓవర్ లోడ్, ఓవర్ హైట్ పేరుతో వైసీపీ  ప్రభుత్వం మమ్మల్ని దోచుకుంటుంది. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ పేరుతో ఏడాదికి రూ.60వేలు అదనపు భారం పడుతుంది. జగన్ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేయడం వల్ల ట్రాన్స్ పోర్ట్ రంగంపై ఆధారపడిన వారు రోడ్డున పడ్డాం. రోడ్లు కూడా దారుణంగా ఉండటం వల్ల ట్రాన్స్ పోర్ట్ యాజమానులపై విపరీతమైన భారం పడుతుంది.

ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయండి

ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి.  ఆటో నగర్ లో పనిచేస్తున్న కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు ఏర్పాటు చేయండి. పంచర్ షాపులు పై ఆధారపడిన వారు జీఎస్టీ వలన ఇబ్బంది పడుతున్నారు. టైర్లు కొనాలి అన్నా, పాత టైర్ అమ్మాలి అన్నా జీఎస్టీ పేరుతో వేధిస్తున్నారు. 57 ఏళ్లుగా ఆటో నగర్ లో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. అయినా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం.

షాపులకు యాజమాన్యహక్కులు కల్పించండి

ఆటో నగర్ లో షాపులకు యాజమాన్య హక్కులు లేక ఇబ్బంది పడుతున్నాం. జగన్ ఇప్పుడు ఆటో నగర్ ని తరలిస్తామని బెదిరిస్తున్నాడు. జగన్ ఆటో నగర్ ని నాశనం చేస్తూ ఇచ్చిన జీఓ లను రద్దు చెయ్యాలి. టెక్నాలజీ మారి బి ఎస్ 6 వాహనాలు వస్తున్నాయి. మాకు నైపుణ్య శిక్షణ ఇప్పించాలి. మెకానిక్స్ కి శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. ట్రాన్స్ పోర్ట్ రంగంపై ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తున్నాకార్మకులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదు. ఇన్స్యూరెన్స్ , ఆరోగ్య భద్రత కల్పించాలి. టూ వీలర్ మెకానిక్స్ ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి.

నారా లోకేష్ ను కలిసిన ముస్లిం సామాజికవర్గీయులు

విజయవాడ తూర్పు నియోజకవర్గం డివి మేనర్ వద్ద ఎన్టీఆర్ జిల్లా ముస్లింలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ పాలనలో ప్రవేశపెట్టిన ముస్లిం సంక్షేమ పథకాలను వైసీపీ రద్దు చేసింది. విదేశీవిద్య, దుల్హన్ పథకాలను రద్దు చేశారు. విజయవాడలో రెండవ హజ్ హౌస్, ఇస్లామిక్ సెంటర్ నిర్మించాలి. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక చేయూతనివ్వాలి. మసీదుల రిపేర్లు, షాదీఖానాల నిర్మాణాలు చేయాలి. మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్ ను కొనసాగించాలి. రంజాన్ తోఫా, చంద్రన్న బీమా, దుకాన్-మకాన్ పథకాలు పునరుద్ధరించాలి. వక్ఫ్ బోర్డు ఆస్తులతోపాటు ముస్లింలకు రక్షణకు చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

మసీదు ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను నర్సరావుపేటలో దారుణంగా నరికిచంపారు. మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు రూ.5,400కోట్లను దారిమళ్లించి తీరని ద్రోహం చేశాడు. అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన మైనారిటీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. దుల్హన్ పథకాన్ని ఎటువంటి కొర్రీలు లేకుండా పేద ముస్లింలందరికీ వర్తింపజేస్తాం. పేదముస్లింలకు ఆర్థిక చేయూతనందించేందుకు ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తాం. మసీదుల రిపేర్లు, షాదీఖానాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన విజయవాడ న్యాయవాదులు

విజయవాడ తూర్పు నియోజకవర్గం లలితా జ్యుయలరీస్ వద్ద బెజవాడ న్యాయవాదులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో అడ్వొకేట్లకు  రక్షణ కరువైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న లాయర్లపై దాడులు జరుగుతున్నాయి. అడ్వొకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. అర్హులైన అడ్వొకేట్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అడ్వొకేట్లకు హెల్త్ కార్డులు ఇచ్చి వైద్యం అందించాలి. ప్రమాదంలో చనిపోయిన అడ్వొకేట్లకు రూ.10లక్షలు పరిహారం ఇప్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

టిడిపి అధికారంలోకి వచ్చాక అడ్వొకేట్లకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం. అడ్వకేట్లకు సబ్సిడీపై ధరపై ఇళ్లస్థలాలు కేటాయిస్తాం. హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన విజయవాడ మహిళలు

విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నగర మహిళలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ పాలనలో మహిళలు న్యాయం కోసం రోడ్లపై పోరాడాల్సిన పరిస్థితులు వచ్చాయి. మహిళలకు పట్టపగలే రక్షణలేని పరిస్థితి నెలకొంది, చీకటిపడితే నగర శివార్లలో బ్లేడ్ బ్యాచ్ లు, గంజాయిబ్యాచ్ ల ఆగడాలు పెరిగిపోయాయి. కళాశాలలు, మార్కెట్ ల ప్రాంతాల్లో కామాంధులు మహిళలపై వేధింపులు, దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినవారిపై తప్పుడుకు కేసులు పెట్టి వేధిస్తున్నారు.  ఎన్నడూ పోలీసు స్టేషన్ గడప తెలియని మహిళలు నేడు కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తోంది. మీరు అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కల్పించి, తప్పుడు కేసులను ఎత్తివేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూలేనివిధంగా మహిళలపై సైకోలు దాడులకు తెగబడుతున్నారు. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయి.  అధికారంలోకి రాగానే మద్యనిషేధం చేస్తానని చెప్పిన సిఎం మాటతప్పి జె-బ్రాండ్ల మద్యాన్ని తెచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలో వైసిపి నేతల సారధ్యంలో గంజాయి విక్రయిస్తుండటంతో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. నాలుగేళ్లలో గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో మహిళలపై 52,587 నేరాలు జరిగాయి. రోజుకు  సగటున 50, గంటకు రెండు నేరాలు నమోదుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక  22,278 మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలపై దాడులు, అఘయిత్యాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతాం. మహిళల వంక చూడాలంటే భయపడే విధంగా చట్టాలను కఠినంగా అమలుచేస్తాం. మహిళలపై నమోదుచేసిన తప్పుడు కేసులను ఎత్తివేస్తాం.

లోకేష్ ను కలిసిన నగరాల సామాజికవర్గీయులు

విజయవాడ పటమట సెంటర్ లో నగరాల సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నగరాల సామాజికవర్గం 40వేల పైచిలుకు ఓటర్లు ఉన్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ 2008లో మా సామాజికవర్గాన్ని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణాజిల్లాల్లో బిసి-డి కింద చేర్చారు. అయితే కేవలం 4జిల్లాలకే పరిమితం చేయడంతో ఇబ్బంది పడుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా నగరాల సామాజికవర్గాన్ని బిసి –డి గా పరిగణించేలా చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న మా సామాజికవర్గీయులను ప్రోత్సహించి రాజకీయంగా అవకాశాలు కల్పించాలి. చట్టసభలు, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

నారా లోకేష్ మాట్లాడుతూ

పార్టీ ఆవిర్భావం నుండి బలహీనవర్గాలకు అండగా నిలచిన పార్టీ తెలుగుదేశం . కులానొకొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి తీరని అన్యాయం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా నగరాలను బిసి-డిగా పరిగణించే అంశంపై చర్యలు తీసుకుంటాం. జనాభా దామాషా ప్రకారం నగరాల సామాజికవర్గీయులకు నిధులు, రాజకీయ అవకాశాలు కల్పిస్తాం.

లోకేష్ ను కలిసిన బీమా మిత్రల యూనియన్ ప్రతినిధులు

విజయవాడ ఆటోనగర్ గేటు వద్ద బీమా మిత్రల యూనియన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ బీమా మిత్రలకు నెలకు వేతనం రూ.3వేలు, పారితోషికాలు రెట్టింపు చేస్తామని చెప్పి, అమలు చేయలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బీమా మిత్రలను నిర్లక్ష్యం చేశారు. బీమా మిత్రలు చేసే పనిని వాలంటీర్లు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు అప్పగించారు. బీమా మిత్రలకు 7నెలల పారితోషికాలు బకాయి పెట్టారు. 2020 ఏప్రిల్ 1 నుండి వైఎస్ఆర్ బీమా చెల్లింపులు నిలిపేశారు, వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలి. బీమా మిత్రల పనిని ఎవరికీ అప్పగించకుండా మమ్మల్ని కొనసాగించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ పాలనలో అన్నిరకాల ఉద్యోగులు బాధితులే. మాటతప్పడం, మడమతిప్పడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. ప్రశ్నించినవారిపై పోలీసులతో లాఠీచార్జి చేయడం, తప్పుడు కేసులతో వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. బీమా మిత్రల సహకారంతో టీడీపీ పాలనలో చంద్రన్న బీమాను విజయవంతంగా అమలు చేశాం. టిడిపి అధికారంలోకి వచ్చాక బీమా మిత్రుల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగిస్తాం. బీమా మిత్రలకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన సీనియర్ సిటిజన్లు

విజయవాడ పటమట హైస్కూలు రోడ్డు వద్ద సీనియర్ సిటిజన్లు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర జనాభాలో 12శాతం 60ఏళ్లు పైబడిన వయో వృద్దులం ఉన్నాం. మేం అనేక మానసిక,శారీరక,ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాం. మా ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కరువైంది. వేధింపులు, ఛీత్కారాలకు గురవుతున్నాం. జీవిత చరమాంకంలో ప్రశాంతత, తృప్తికరమైన జీవితాలకు దూరమవుతున్నాం. వయోవృద్దుల సంక్షేమానికి ప్రవేశపెట్టే పథకాలు అమలులో జాప్యం, నిర్లక్ష్యం జరుగుతోంది. స్వార్జిత ఆస్తులున్న వృద్దులు బిడ్డల ద్వారా ఆదరణకు నోచుకోకపోతే బ్యాంకులు రివర్స్ మార్టిగేజ్ స్కీం ద్వారా ఆర్థిక అవసరాలను తీర్చుకునే అవకాశాన్ని అమలు చేయాలి. వృద్దుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదా కమిషనరేట్ ఏర్పాటు చేయాలి. వృద్దాప్య పెన్షన్ ను కనీసం రూ.5వేలకు పెంచాలి. జిల్లాకు ఒక వృద్దాశ్రమాన్ని ఏర్పాటు చేసి వాటికి సహాయ,సహకారాలు అందించాలి. కరోనా సమయంలో రద్దు చేసిన సీనియర్ సిటిజన్స్ రైల్వే రాయితీలను పునరుద్ధరించాలి. వృద్దుల సంక్షేమానికి 2007లో తెచ్చిన తల్లిదండ్రుల పోషణ, వృద్దుల చట్టాన్ని పార్లమెంటు ఆమోదించేలా కృషి చేయాలి. ప్రభుత్వ,ప్రైవేటు బ్యాంకులు, ఎల్.ఐ.సీ వద్ద ఎవరూ క్లైమ్ చేయని రూ.1.45లక్షల కోట్లను వృద్దుల సంక్షేమానికి ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ ను కలిసిన కానూరు ప్రజలు

పెనమలూరు నియోజకవర్గం కానూరు 80అడుగుల రోడ్డు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 1993లో ఉడా మాస్టర్ ప్లాన్ ప్రకారం 80అడుగులు రోడ్డును తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏలూరు, బందర్ హైవేలపైకి వెళ్లేందుకు వీలుగా ఈ రోడ్డును చేపట్టాలని నిర్ణయించారు. బందర్ రోడ్డుపై ట్రాఫిక్ తగ్గించేందుకు తాడిగడప వరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నుండి రోడ్డును కలిపారు. 80అడుగుల రోడ్డు ద్వారా ఏలూరు హైవే ను ఆటోనగర్ కలిపేందుకు 2015-18 మధ్య పనులు ప్రారంభించారు. కానూరు సనత్ నగర్ లో భూసేకరణ సమస్య వల్ల పనులు నిలిచిపోయాయి. ఫలితంగా ఆటోనగర్ 100అడుగుల రోడ్డు నుండి పనులు ముందుకు సాగడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక ఈ పనులు పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ అధికారంలోకి వచ్చాక విజయవాడ నగరాన్ని భ్రష్టు పట్టించారు. కనీసం డ్రైనేజీల్లో మురుగు తీయలేని దుస్థితిలోకి వి.ఎం.సీ ని నెట్టారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులను కూడా సర్కారు లాగేసింది.  దీంతో విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలచిపోయాయి. విజయవాడ నగర అభివృద్ధి, సుందరీకరణ జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. విజయవాడ రూపురేఖలు మార్చిన ఘనత చంద్రబాబు గారిది. విజయవాడకు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను తెచ్చిన ఘనత టీడీపీ కి దక్కుతుంది. టిడిపి అధికారంలోకి వచ్చాక విజయవాడలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు పునఃప్రారంభిస్తాం. వివాదాలను పరిష్కరించి, భూసేకరణ వల్ల నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తాం. 80అడుగుల రోడ్డు పనులను త్వరిత గతిన పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటాం.

యువనేతను కలిసిన పెనమలూరు ముస్లింలు

విజయవాడ కామయ్యతోపులో పెనమలూరు మసీదు నిర్వహణ కమిటీ సభ్యులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పెనమలూరు నియోజకవర్గ తాడిగడప మున్సిపాలిటీలో 62వేలమంది ముస్లిం జనాభా ఉన్నాం. తమ ప్రాంతంలో 15మసీదులు ఉన్నాయి, అయితే పవిత్ర పండుగల సమయాల్లో నమాజ్ చేసుకోవడానికి ఈద్గా సౌకర్యం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక ఈద్గా ఏర్పాటుచేయాల్సిందిగా కోరుతున్నాము.

నారా లోకేష్ మాట్లాడుతూ

రాష్ట్రంలో మొట్టమొదటిగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటుచేసిన ఘనత దివంగత ఎన్టీఆర్ ది. ఆ తర్వాత చంద్రబాబునాయుడు ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వ హయాంలో విజయవాడ, కడప నగరాల్లో నిర్మించిన హజ్ హౌస్ లను వైసిపి ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడం చేతగాక పాడుబెడుతోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెనమలూరు ముస్లింలకు ఈద్గా ఏర్పాటుచేస్తాం. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేసి పేద ముస్లింల ఆర్థిక స్వావలంబనకు చర్యలు చేపడతాం.

నారా లోకేష్ ను కలిసిన కంకిపాడు మండల ప్రజలు

పెనమలూరు నియోజకవర్గం పోరంకి సెంటర్ లో  కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు, వణుకూరు, మద్దూరు, కాసరనేనిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా మండలంలో TDP పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోడ్లపై గుంతల్లో తట్ట మట్టి పోసిన దాఖలాలు లేవు. ఉప్పులూరు నుండి ఈడుపుగల్లు మీదుగా మద్దూరు వరకు ఆర్.అండ్.బి రహదారి నిర్మాణానికి టిడిపి హయాంలో అంచనాలు తయారుచేసి, టెండర్లు కూడా పిలిచారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రతిపాదనలు ఎక్కడివక్కడే నిలచిపోయాయి.  బందరు రోడ్డు నుండి ఏలూరు రోడ్డులోకి వెళ్లే రోడ్డు మొత్తం గతుకులమయమై ఇబ్బందులు పడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన రోడ్డు పనులు పూర్తిచేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ధ మౌలిక సదుపాయాల కల్పనపై లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెనమలూరు నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా రోడ్లపై తట్టడు మట్టి పోసిన దాఖలాలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు 1.30లక్షల కోట్లరూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టారు. దివాలాకోరు ప్రభుత్వాన్ని చూసి ఏ కాంట్రాక్టర్ పనులు చేయడానికి ముందుకు రావడంలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప్పులూరునుంచి ఈడ్పుగల్లుమీదుగా మద్దూరు ఆర్ అండ్ బి రహదారి నిర్మాణాన్ని చేపడతాం.

Also Read This Blog: Andhra’s Youth and Leadership: Nara Lokesh’s Yuvagalam Padayatra Story

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *