NaraLokesh padayatra,Yuvagalam
NaraLokesh padayatra,Yuvagalam

పోలవరం నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం గిరిజన గ్రామాల్లో యువనేతకు బ్రహ్మరథం పట్టిన జనం

నేడు జంగారెడ్డిగూడెం బహిరంగసభలో లోకేష్ ప్రసంగం

పోలవరం: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా సాగుతున్నNara Lokesh యువగళం పాదయాత్ర పోలవరం అసెంబ్లీ నియోజకర్గంలో ఉత్సాహంగా సాగింది. 198వరోజు యువగళం పాదయాత్ర చింతలపూడి నియోజకవర్గం తీగలవంచ నుంచి ప్రారంభమై టి.నర్సాపురం శివార్లలో పోలవరంలోకి ప్రవేశించింది. దారిపొడవునా గిరిజన గ్రామాల్లో యువనేతకు ఘనస్వాగతం లభించింది. అడుగడుగునా యువనేతకు బ్రహ్మరథం పట్టారు. తోబుట్టువు మాదిరిగా హారతులిస్తూ యువనేతను ఆశీర్వదించారు. వేలాదిమంది ప్రజలు యువగళానికి సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు భారంగా మారాయని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే చంద్రన్న ప్రభుత్వం ధరలను అదుపులోకి తెచ్చి ఉపశమనం కలిగిస్తుందని భరోసా ఇచ్చారు. దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు యువనేతను కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.  తీగలవంచనుంచి ప్రారంభమైన పాదయాత్ర పోలవరం నియోజకవర్గం టి.నర్సాపురం, గురవాయిగూడెం, ఏపిగుంట, శ్రీరామవరం, తిరుమలదేవిపేట, వెంకటాపురం మీదుగా బొర్రంపాలెం విడిది కేంద్రానికి చేరుకుంది. 198వరోజు యువనేత లోకేష్ 22.5 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2669.2 కి.మీ.ల మేర పూర్తయింది. బుధవారం సాయంత్రం చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో నిర్వహించే బహిరంగసభలో లోకేష్ ప్రసంగిస్తారు.

పోలవరం పూర్తిచేసేది చంద్రబాబే…

నిర్వాసితులకు న్యాయంచేసేది టిడిపినే!

2017 సర్వేప్రకారం పరిహారం చెల్లిస్తాం

గతంలో ప్రకటించిన ప్యాకేజికి కట్టుబడి ఉన్నాం

ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం సిద్ధం

పోలవరం నిర్వాసితులతో ముఖాముఖిలో లోకేష్

పోలవరం: ఆంధ్ర రాష్ట్రానికి వరమైన పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే, నిర్వాసితులకు న్యాయం చేసేది టిడిపి ప్రభుత్వమేనని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పోలవరం నియోజకవర్గం శ్రీరామవరం మధ్యాహ్న భోజన విడిది కేంద్రం వద్ద పోలవరం నిర్వాసితులతో నిర్వహించిన ముఖాముఖిలో యువనేత లోకేష్ పాల్గొన్నారు. సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… పోలవరానికి శాపం జగన్,  చంద్రబాబు గారి హయాంలో 72 శాతం పనులు పూర్తిచేశారు. 1.15 లక్షల ప్యాకేజిని 6.36 లక్షలకు పెంచింది చంద్రబాబు. 4వేల కోట్లు నిర్వాసితులకు ప్యాకేజ్, పునరావాసం కోసం ఖర్చు చేసింది చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని కేంద్రాన్ని ఒప్పించి పనులు వేగవంతం చేసింది చంద్రబాబు. మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు. ముందు 19 లక్షల ప్యాకేజ్ అన్నాడు, ఆ తరువాత 10 లక్షలు అన్నాడు, వైఎస్ గారి హయాంలో జరిగిన భూసేకరణకి అదనంగా 5 లక్షలు ఇస్తానని అన్నాడు. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు కేంద్రం బటన్ నొక్కితేనే నిర్వాసితులకు డబ్బులు అంటున్నాడు. పోలవరం నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇవ్వడు, ఇళ్లు కట్టడు. ఆ రిపోర్ట్ ప్రకారం మరో ఆరు నెలలు పోతే సింగిల్ డిజిట్ అని చెప్పారు. అందుకే వైసీపీ ముందస్తు ఎన్నికలకి వెళ్ళబోతున్నాడు అని సమాచారం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపి సిద్దం.

నాలుగేళ్లలో పూర్తిచేసింది 4శాతమే!

వైసీపీనాలుగేళ్లలో కేవలం 4 శాతం పనులు పూర్తి చేసాడు. వైసీపీ రివర్స్ టెండర్ విధానం వలన పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో పడింది. డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దెబ్బతిన్నాయి. నిర్వాసితులకు జగన్ ఒక్క ఇల్లూ కట్టలేదు… ఒక్కరికీ పూర్తిగా ప్యాకేజ్ అమలు చెయ్యలేదు. ఇచ్చిన హామీలు అన్ని మర్చిపోయి పోలవరం నిర్వాసితులను మోసం చేసాడు. బుల్లెట్ దిగుతుంది అన్న మంత్రి కి బుల్లెట్ దిగింది. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుంది అని ఇప్పుడున్న మంత్రి ని అడిగితే అరగంట అంటున్నాడు.

గత ప్యాకేజికి కట్టుబడి ఉన్నాం!

టిడిపి గతంలో ప్రకటించిన ప్యాకేజ్ కి కట్టుబడి ఉన్నాం. టిడిపి అధికారంలోకి రావడం, పోలవరం పూర్తి చేసేది ఖాయం. వైసీపీ పాలనలో పోలవరం ప్రమాదం లో పడింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన నష్టంపై అధ్యయనం చేసి ప్రాజెక్టు వేగంగా పూర్తి చేస్తాం. అధ్యయనం తరువాత ఎప్పటి లోగా పూర్తి చేస్తాం అనేది చెబుతాం. 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మించాలి అనేది టిడిపి నిర్ణయం. జగన్ ఎత్తు తగ్గించి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చెయ్యాలని చూస్తున్నాడు. నిర్వాసితులకు ప్యాకేజ్ తో పాటు అన్ని సౌకర్యాలతో కాలనీలు ఏర్పాటు చేస్తాం.

విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం

టిడిపి హయాంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.  కరెంట్ ఇవ్వడు… కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశాడు. వందల్లో వచ్చే బిల్లు వేలల్లో వస్తుంది. మీరు కాల్చే ప్రతి యూనిట్ విద్యుత్ లో వైసీపీకి వాటా వెళ్తుంది. 16 నెలలు జైల్లో ఉన్న వాడి మాట వినోద్దు అని చెప్పినా జగన్ ని చూసి జాలిపడి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ బాదుడే బాదుడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ కోతలు ఉండవు, పెంచిన విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తాం.

నోటికొచ్చిన హామీలు ఇవ్వను!

అబద్ధాలు, మాయమాటలు చెప్పడం సులభం. కానీ ఇచ్చిన మాట పై నిలబడటం చాలా కష్టం. గిరిజన ప్రాంతాల్లో యువత కు ఉద్యోగాలు కల్పించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చెయ్యడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తాం. పోలవరం ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ మాట్లాడుతూ… పోలవరానికి వైసీపీప్రభుత్వం చేసింది ఏమి లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాం.

పోలవరం నిర్వాసితులు మాట్లాడుతూ….

ఇప్పుడు గతంలో ఇచ్చిన 6.36 లక్షలు కూడా ఇవ్వడం లేదు. నిర్వాసితులను ముంచి ఆయన హ్యాపీగా పడుకున్నాడు. వరదలు వచ్చినప్పుడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాం. ప్రభుత్వం కనీసం మమ్మలని పట్టించుకోవడం లేదు. నిర్వాసితులు బ్రతకడానికి ఇతర ప్రాంతాలకు వెళితే స్థానికులు కాదని జగన్ ప్రభుత్వం అంటుంది. రీసర్వే పేరుతో మేము తీవ్రంగా నష్టపోతున్నాం.

రీసర్వే పేరుతో వేధింపులు

 2017 లో ఒక సారి సర్వే అయినా మరోసారి సర్వే అంటూ వైసీపీప్రభుత్వం వేధిస్తుంది. ఊర్లు ఖాళీ చేయించి వైసీపీ ప్రభుత్వం మాకు ఎటువంటి సాయం అందించలేదు. వైసీపీ వలన ఏమి కాదు అని తేలిపోయింది. 2017 కట్ ఆఫ్ డేట్ పెట్టి అప్పటికి 18 ఏళ్లు ఉన్నవారికి ప్యాకేజ్ కి అర్హులుగా టిడిపి ప్రభుత్వం ప్రకటించింది. వైసీపీ వచ్చిన తరువాత ప్యాకేజ్ ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది.  బాబు గారిని నమ్మి 7 మండలాలు ఏపి లో కలవడానికి ఒప్పుకున్నాం. వైసీపీ ప్రభుత్వం కనీసం మమ్మలని మనుషుల్లా కూడా చూడటం లేదు. ముంపు ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

యువనేతను కలిసిన తీగలవంచ గ్రామస్తులు

చింతలపూడి నియోజకవర్గం తీగలవంచ గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. చింతలపూడి నుండి టి.నర్సాపురం మండల కేంద్రం వరకు రహదారి అస్యవ్యస్తంగా ఉంది. డబుల్ రోడ్డుగా విస్తరించాలి. చింతలపూడి నుండి యర్రగుంటపల్లి రోడ్డు మధ్యలో రేచర్ల గ్రామంలో చెరువును తలపిస్తోంది. మరమ్మతులు చేపట్టాలి. పామాయిల్ రైతులకు పెట్టుబడి పెరిగింది, మార్కెట్ సరిగా లేకపోవడంతో సరైన ధరలేదు, గిట్టుబాటు ధర కల్పించాలి. తీగలవంచ గ్రామంలో ఉన్న కరెంటులైన్లు 40సంవత్సరాల క్రితం ఏర్పాటుచేశారు, తమ గ్రామంలోని విద్యుత్ లైన్లను మార్చి కొత్తవి ఏర్పాటుచేయాలి. కోకో రైతులు దళారుల చేతిలో నష్టపోతున్నారు, రైతుల సౌకర్యార్థం కోకో బోర్డు ఏర్పాటుచేసి గిట్టుబాటు ధర కల్పించాలి.

యువనేత లోకేష్ స్పందిస్తూ.

వైసీపీ  దివాలాకోరు పాలనలో రోడ్లపై తట్టిమట్టిపోసే దిక్కులేకపోవడంతో గ్రామీణ రహదార్లు చెరువులను తలపిస్తున్నాయిటిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ.ల సిసి రోడ్లు నిర్మించాం. అధికారంలోకి రాగానే చింతలపూడి-టినర్సాపురం, రేచర్ల రోడ్లను పునర్నిర్మిస్తాం. పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటాం. గిరిజన కార్పొరేషన్ ద్వారా కోకో పంటను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన టి.నర్సాపురం గ్రామస్తులు

పోలవరం నియోజకవర్గం టి.నర్సాపురం గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. వర్షాకాలంలో వర్షం నీరు, ఎగువున ఉన్న గండిచెరువు తెగిపోవడం వల్ల టి.నర్సాపురంలో ఉన్న సుమారు 300 ఇళ్లలోకి వరదనీరు రావడంతో తీవ్ర నష్టం వాటిళ్లుతుంది.  పంచాయతీ పరిధిలోని ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీగా ఉండగా పట్టించుకోకపోవడంతో ఇబ్బంది పడుతోంది. టి.నర్సాపురం నుండి బంధంచెర్ల వెళ్లే రహదారి అధ్వాన్నంగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పెడుతున్నారు. బంధంచర్ల వెళ్లే రోడ్డు చిన్నదిగా ఉంది..డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి.  పేదలకు పక్కా ఇళ్లు మంజూరు చేయాలి. అసైన్డ్ బూములను జీరాయితీ భూమిగా పరిగణలోకి తీసుకోవాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

TDP హయాంలో నీరు – చెట్టు ద్వారా చెరువుల మరమ్మతులు చేపట్టి ఆనకట్టలు పటిష్టం చేసేవాళ్లం..కానీ ఈ ప్రభుత్వం కనీసం చెరువుల్లో పూడిక కూడా తీయడం లేదు. టీడీపీ రాగానే గండిచెరువు కట్టకు మరమ్మతులు చేపట్టి వర్షపు నీటిని ఇళ్లలోకి రాకుండా చేస్తాం. డ్రైనేజీ సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తాం. టి.నర్సాపురంలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు దారుణంగా ఉన్నాయి. రహదారులు సరిగా లేకపోవడం వల్లకూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లకు 1.30 లక్షల కోట్లు బిల్లులు పెండింగులో పెట్టడంతో పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. టీడీపీ అధికారంలోకి రాగానే టి.నర్సాపురం – బంధంచర్ల మధ్య కొత్త రోడ్డు నిర్మాణం చేపడతాం. అర్హులైన పేదవాళ్లకు టీడీపీ రాగానే పక్కాఇల్లు నిర్మిస్తాం.  ఎన్నో ఏళ్లుగా అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్నవారికి హక్కులు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన  దళితులు

పోలవరం నియోజకవర్గం టి.నర్సాపురం దళితులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. పంచాయతీ పరిధిలోని ఎస్సీ వర్గానికి ఇళ్ల స్థలాలు కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. మురికినీరు రోడ్లపైకి రావడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నందున డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి. ఎస్సీ కాలనీలోని వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయకపోవడంపై అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ఎస్సీకాలనీలోని చిన్నారులకు అంగన్ వాడీ కేంద్రాన్ని నిర్మించాలి. ఎస్సీలపై నిత్యం అరాచకాలు, మహిళలపై అక్రమకేసులు పెడుతున్నారు. స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్నాం..స్మశానం ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్  మాట్లాడుతూ…

కేంద్రం గతేడాది రాష్ట్రానికి 1,78,899 ఇళ్లు కేటాయిస్తే జగన్ కట్టింది కేవలం 2,167 ఇళ్లే. టీడీపీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతిఒక్కరికీ ఇల్లు నిర్మిస్తాం.  టీడీపీ వచ్చాక దళిత వాడల్లో డ్రైనేజీలు ఏర్పాటు చేస్తాం. బ్లీచింగ్ పౌడర్ చల్లే దుస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. ఓట్లేసి గెలిపించిన దళితులకే గుండు కొట్టించిన సైకోకు ఎస్సీలు బుద్ధి చెప్పాలి. ఎస్సీలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక దామాషా ప్రకారం ఎస్సీలకు స్మశాన వాటిక ఏర్పాటు చేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఏపిగుంట గ్రామస్తులు

పోలవరం నియోజకవర్గం ఏపిగుంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మార్కెట్ ధరలు పడిపోయినపుడు నిమ్మరైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, నష్టనివారణకు కోల్డ్ స్టోరేజిల నిర్మాణం చేపట్టాలి. గత టిడిపి ప్రభుత్వంలో ఎస్సీ, బిసిలకు ఇళ్లపట్టాలు ఇచ్చారు, ఈ ప్రభుత్వం వచ్చాక ఇళ్లు మంజూరు చేయలేదు. పామాయిల్, నిమ్మరైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. గ్రామంలో నిలచిపోయిన డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

రాష్ట్రంలో వ్యసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి కారణంగా అన్నివర్గాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో రాష్ట్రరైతుల సగటు అప్పు రూ.75వేలు ఉంటే, ఇప్పుడు రూ.2.45లక్షలకు చేరుకుంది. దేశం మొత్తమ్మీద ఎపి రైతులు అప్పుల్లో మొదటిస్థానంలో ఉన్నారు. అధికారంలోకి వచ్చాక నిమ్మరైతులకు కోల్డ్ స్టోరేజిలు నిర్మిస్తాం. పామాయిల్, నిమ్మరైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటాం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి అధునాతన టెక్నాలజీతో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.

లోకేష్ ను కలిసిన తిరుమలదేవిపేట గ్రామస్తులు

పోలవరం అసెంబ్లీ నియోజకర్గం తిరుమలదేవిపేట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలు నివసించే ప్రాంతంలో డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలి. ఎన్టీఆర్ బిసి కాలనీలో తాగునీటి సమస్య ఉంది, వాటర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేపట్టాలి. ఎస్టీలు ఎక్కువగా నివసించే మల్లప్పగూడెం, సాలిగూడెం, అబ్ధుల్లాపురం ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ఎస్సీ ఏరియాలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి బోర్లు వేయించాలి. ఎస్టీ ఏరియాలో ఉన్న ఇళ్లులేని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విస్తరణ సమయంలో రైతులను రెచ్చగొట్టిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక వారికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బిసిలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలతోపాటు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ప్రతిఇంటికీ కుళాయి అందజేసి, స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. ఇల్లులేని ప్రతి పేదవాడికి అధునాతన టెక్నాలజీతో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం.

లోకేష్ ను కలిసి వెంకటాపురం గ్రామస్తులు

పోలవరం నియోజకవర్గం వెంకటాపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. గ్రామపరిధిలో నిరుపేదల స్వాధీనంలో ఉన్న డి.పట్టా భూమిపై హక్కులు కల్పించాలి. శ్మశానవాటికకు స్థలం కేటాయించి, సౌకర్యాలు కల్పించాలి. గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మించాలి. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నాం, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలి. మా గ్రామంలో ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలి. గ్రీన్ ఫీల్డ్ హైవేను అనుసంధానం చేస్తూ సబ్ లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్తప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకపోగా, నిర్వహణచేతగాక ఉన్న ప్రాజెక్టులను కూడా పాడుబెడుతున్నాడు. పశ్చిమగోదావరి, కృష్ణా మెట్టప్రాంతాల్లో 33మండలాల్లో 4.8లక్షల ఎకరాలకు తాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పూర్తిచేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక నిర్వాసితులకు పరిహారం అందజేసి, రెండేళ్లలో చింతలపూడి ఎత్తిపోతల పనులు పూర్తిచేస్తాం. వెంకటాపురం గ్రామంలో కమ్యూనిటీ హాలు, శ్మశాన వాటికలకు స్థలం కేటాయిస్తాం. ఇల్లు లేని ప్రతిపేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం. నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి అనుసంధాన రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన బొర్రంపాలెం ప్రజలు

పోలవరం నియోజకవర్గం బొర్రంపాలెం గ్రామప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బొర్రంపాడు, వెలగపాడు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వైద్యసేవలందించేందుకు 1.49కోట్లతో చేపట్టిన 10పడల ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ అర్థంతరంగా నిలిపివేశారు. మీరు అధికారంలోకి వచ్చాక హాస్పటల్ నిర్మాణం పూర్తిచేయాలి. బొర్రంపాలెం నుండి సూరంపూడి గ్రామానికి ఆర్ అండ్ బి రహదారి నిర్మాణం చేపట్టాలి. ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాలు, వాటర్ ట్యాంక్, డ్రైనేజిల నిర్మాణం చేపట్టాలి. ముస్లింలకు షాదీఖానా, ఖబరిస్థాన్ లు ఏర్పాటుచేయాలి. ఇల్లులేని పేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలి. బొర్రంపాలెం చుట్టుపక్కల ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నందున కరాటం కృష్ణమూర్తి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ నుండి రైతులకు నీరందించేలా చర్యలు చేపట్టాలి. శ్మశాన వాటికలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. వర్షంపడితే బొర్రంపాలెం మెయిన్ రోడ్డులో నీరు చేరుతున్నందున అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి. గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిమిత్తం తీసుకున్న భూములకు గతంలో రైతులకు తక్కువ పేమెంట్ ఇచ్చారు. దీనిపై రైతులు కోర్టును ఆశ్రయించినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. రైతులకు న్యాయం చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో కనీసం సూదులు, దూది వంటివి కూడా లేకుండా చేసి పేదల ప్రాణాలతో చెలగాటమాటమాడుతున్నారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కరోనా సమయంలో ఆక్సిజన్ అందక వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బొర్రంపాలెం వైద్యశాల నిర్మాణాన్ని పూర్తిచేస్తాం. కరాటం కృష్ణమూర్తి ఎత్తిపోతల పథకం ద్వారా బొర్రంపాలెం, పరిసర గ్రామాలకు రైతులకు నీళ్లందిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, శ్మశానవాటికల వంటి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. న్యాయపరమైన చిక్కులను తొలగించి, హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం.

బజ్జీల దుకాణదారుతో లోకేష్ మాటామంతీ

పోలవరం నియోజకవర్గం బొర్రంపాలెంలో పాదయాత్ర సందర్భంగా బజ్జీల దుకాణం నిర్వహిస్తున్న గొడుగు లక్ష్మిఅనే మహిళతో లోకేష్ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా లక్ష్మీ తమ కష్టాలను చెబుతూ టిడిపి హయాంలో తనకు ఇల్లు మంజూరైంది, ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదు. గ్యాస్, కరెంటుబిల్లు, నిత్యవసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. చాలీచాలని ఆదాయంతో బతుకుబండి లాగడం కష్టాంగా ఉందని ఆవేదన వ్యక్తంచేసింది.

నారా లోకేష్ స్పందిస్తూ

మీలాంటి మహిళల కోసమే చంద్రబాబునాయుడు మహాశక్తి కార్యక్రమాన్ని రూపొందించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం కార్యక్రమంలో ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలున్నా ఒక్కొక్కరికీ 15వేలు ఇస్తాం. మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణంతోపాటు ఏటా 3 గ్యాస్ సిలండర్లు ఉచితంగా ఇస్తాం. పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి అన్నివర్గాల ప్రజలకు ఉమశమనం కలిగిస్తాం. లక్ష్మి ఇంటితో సహా పేదల పక్కా ఇళ్లకు సంబంధించి బకాయిలన్నీ చెల్లిస్తాం. మీకోసం పనిచేసే చంద్రబాబునాయుడు సిఎం చేసేందుకు మీవంతు సహకారం

Also Read This Blog :Walking for a Cause: Yuvagalam’s Expedition of Impactful Change

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *